calender_icon.png 3 April, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీఏ అధ్యక్షుడిని పదవి తప్పించాలి

03-04-2025 01:36:09 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసి యేషన(హెచ్‌సీఏ) అధ్యక్షుడు ఏ జగన్‌మోహన్‌రావును పదవి నుంచి తప్పించాలని యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశా రు. బుధవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మెయిన్‌గేటు ఎదుట యూత్ కాంగ్రెస్ ఉప్పల్ అధ్యక్షుడు ఆకారపు అరుణ్ పటేల్ ఆధ్వర్యంలో ధర్నా కు దిగారు.

ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పల్, మడిపెల్లి పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్‌రావుకు జగన్‌మోహన్‌రావు బినామీగా వ్యవహరిస్తూ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ చేశారని ఆరోపించారు. టికెట్ల విక్రయంలో అవినీతికి పాల్పడ్డ జగన్‌మోహన్‌రావుపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు.