calender_icon.png 8 October, 2024 | 10:17 PM

విచారణకు హాజరైన అజారుద్దీన్

08-10-2024 12:58:52 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హజరయ్యారు. గతంలో హెచ్సీఏలో అక్రమాలకు పాల్పాడాడంటూ ఈడీ కేసు నమోదు చేసింది. తాజా 2020-23 సంవత్సరాల మధ్య నమోదైన ఎఫ్ఐఆర్ ఆదారంగా మరో కేసు నమోదు చేసింది.  రూ.20 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఉప్పల్ పోలీసు స్టేషన్ లో పలు ఫిర్యాదులందాయి. దీంతో అజారుద్దీన్ పై కేసు నమోదు చేసిన ఈడీ  ఉప్పల్ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వాహనాలు, ఇతర సమాగ్రి కొనుగోళ్ల అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. విచారణకు హజరు కావాలని అజారుద్దీన్ కు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీంతో మంగళవారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో ఆయన విచారణకు హజరయ్యారు.