calender_icon.png 22 February, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్‌బోర్డ్ సీఈవో తొలగింపు పై స్టే

16-02-2025 12:29:28 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): వక్ఫ్‌బోర్డ్ సీఈవో అసదుల్లాను వెంటనే తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రస్తుత వక్ఫ్‌బోర్డ్ సీఈవోను తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖతోపాటు, సీఈవో ఉన్న అసదుల్లా, సయ్యద్ అజ్మతుల్లా అప్పీలు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభినందుకుమార్ షావిలి, జస్టిస్ తిరుమలాదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సీఈవో నియామకానికి చర్యలు చేపడతామని, సింగి ల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరారు. దీనికి ధర్మాసనం అనుమతిస్తూ వక్ఫ్‌బోర్డ్ సీఈవోను తక్షణం తొల గించాలన్న ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులైన మహమ్మద్ అక్బర్, జహంగీర్‌ఖాన్‌కు నోటీసులు జారీ చేస్తూ విచార ణను మార్చి 12కు వాయిదా వేసింది.