calender_icon.png 22 February, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతసామరస్యానికి ప్రతీక హజరత్ సయ్యద్ ఉర్సు ఉత్సవం

21-02-2025 07:48:37 PM

హిందూ ముస్లింలు ఇష్టంగా కొలిచే ఉర్సు ఉత్సవం..

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాతర శ్రీనివాస్ గౌడ్..

మునుగోడు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం సకల కులాల మతాలకు నిలయమని తారతమ్యాలు లేకుండా బేధభావాలు లేకుండా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి నిర్వహించుకునే ఏకైక పండుగ హజరత్ శరత్ సైదులు జాతర అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఇప్పర్తి, కోతులారం గ్రామాల మధ్యన వెలసిన శ్రీ హజరత్ సయ్యద్ షరీఫ్ జాతరను ప్రతి సంవత్సరం శుక్రవారం రోజున హిందు ముస్లింలు కలిసి పెద్ద ఎత్తున నిర్వహిస్తారు అందులో భాగంగానే ఉర్సు ఉత్సవం ఘనంగా జరిగింది. ఉర్సు ఉత్సవాలకు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. 

ప్రజలందరూ ప్రతి సంవత్సరం హజరత్ సయ్యద్ దర్గాను సందర్శించి పెద్ద ఎత్తున పాల్గొనడం మతాలకతీతంగా కులాల కచ్చితంగా వేలాదిమంది భక్తిశ్రద్ధలతో పాల్గొనడం ఈ జాతరకు ఉన్న ప్రత్యేక లక్షణమని ఆయన కొనియాడారు. వేలాదిమంది ప్రజలు పాల్గొని దర్గాను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని ఈ దర్గాకు రోడ్డు సౌకర్యం తాగడానికి మంచినీళ్లు భక్తులకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ మాజీ అధ్యక్షులు బొడిగె అశోక్, పూల వెంకటేశం, జాజుల వెంకటేశం, నల్ల నాగిరెడ్డి, గురుజ నరసింహ గౌడ్, జాజుల రవీందర్, కందుల ప్రభాకర్, మేకల గోపాల్, జాజుల నరసింహ, అనంతల స్థాయి గౌడ్, కందుల అనిల్ కుమార్, బత్తుల రవికుమార్, ఈసం బాబు తదితరులు పాల్గొన్నారు.