22-02-2025 12:57:06 AM
బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్
మునుగోడు,ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): మత సామరస్యానికి ప్రతీక హజరత్ సయ్యద్ ఉర్సు అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఇప్పర్తిలో హజరత్ సయ్యద్ షరీఫ్ దర్గాలో జరిగిన ఉర్సుకు ఆయన హాజరై మాట్లాడారు. వేలాది మంది వచ్చే దర్గా వద్ద ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
ఆయన వెంట బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు బొడిగె అశోక్, పూల వెంకటేశం, జాజుల వెంకటేశం, నల్ల నాగిరెడ్డి, గురుజ నరసింహ గౌడ్, జాజుల రవీందర్, కందుల ప్రభాకర్, మేకల గోపాల్, జాజుల నరసింహ, అనంతల స్థాయి గౌడ్, కందుల అనిల్ కుమార్, బత్తుల రవికుమార్, ఈసం బాబు ఉన్నారు.