calender_icon.png 28 November, 2024 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత సామరస్యానికి నిదర్శనం ఉర్సే షరీఫ్

28-11-2024 11:43:59 AM

నవంబర్ 30, డిసెంబర్ 1  తేదీల్లో సత్యనారాయణపురంలో ఉర్సు ఉత్సవాల

ఉర్సే షరీఫ్ ఏర్పాట్లు ముమ్మరం చేసిన ఉత్సవ కమిటీ

ఇల్లెందు, (విజయక్రాంతి): మత సామరస్యానికి ప్రతీకగా గత 21 సంవత్సరాలుగా ఇల్లెందులో కొనసాతున్న హజరత్ నాగుల్మీరా మౌళాచాన్ దర్గా షరీఫ్ ఉర్సు ఉత్సవాలు నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణపురం గ్రామ సమీపంలోని ఉన్న దర్గాలో 22వ ఉర్సు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహక కమిటీ సభ్యులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 30 వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు హజరత్ ఖాసీం దుల్హాదర్గాహ్ షరీఫ్ నుంచి బయలుదేరనుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సందల్ ను తీసుకెళ్తారు. డిసెంబర్1న ఉదయం 8 గంటలకు భారీ ఊరేగింపు (జులూన్) ఇల్లెందులోని నెం.2బస్తీలో వెలసిన దర్గాకు సంబందించి నమ్మికొలిచిన భక్తుల పాలిట కొంగుబంగారమవుతున్న హజరత్ ఖాసీం దుల్హాను దర్శించుకుని భక్తులు తన్మయత్తం పొందుతారు.

ముందుగా హజరత్ ఖాసీం దుల్హా దర్గా షరీఫ్ నుంచి పూలు, పండ్లు, ప్రసాదాలను ఊరేగింపుగా హజరత్ హస్సేన్-హుస్సేన్ నాలైదర్ ఆస్థానానికి జరఫ్లతో ఊరేగింపుగా తీసుకొస్తారు. అనంతరం అక్కడ జరఫ్ ప్రత్యేక విన్యాసాలు భక్తులను ఆకుట్టకుంటాయి. హజరత్ హస్సేన్- హుస్సేన్ నాలైదర్ నుంచి దర్గాకు సందలన్ను ఉర్సుగా మాలిక్లు తీసుకొచ్చి దర్గాలో సమర్పిస్తారు. ఈ ఉర్సు ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున మతాలకతీతంగా పాల్గొని పూజలు నిర్వహిస్తారు. పవిత్ర సంధల్ సమర్పించే సమయంలో భక్తులు తన్మయత్తం పొందుతారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యకు ముందు ఉర్సు ఉత్సవాలను నిర్వహిస్తుంటారు.

ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ ఉత్స వాల్లో అన్ని వర్గాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలోపాల్గొని ఆశీస్సులను పొందడం విశేషం. ఈ పూజల్లో పాల్గొనేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. 30న సందల్ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు, డిసెంబర్ 1 న  ఉత్సవాలు లక్ష్మినారాయణ మాలిక్ ఆధ్వర్యంలో సర్దార్, గోడ సహకారాలతో నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఉర్సు ఉత్సవాల్లో ఉచిత దర్శనంతో పాటు, అన్నదాన  కార్యక్రమం నిర్వహించడం విశేషం. ముందస్తుగా సత్యనారాయణ పురం గ్రామం నుంచి దర్గావరకు ఉన్న రహదారికి ఇరుపక్కల శుభ్రం చేస్తున్నారు. దర్గా పరిసరాలను కమిటీ ఆధ్వర్యంలో ఉర్సుకు వచ్చే భక్తులకు అనువుగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.