11-04-2025 12:39:43 AM
అసిస్టెంట్ ప్రొఫెసర్ డీ మక్లకు డాక్టరేట్
ఎల్బీనగర్, ఏప్రిల్ 9 : హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డి.మక్ల కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. సీనియర్ ప్రొఫెసర్ అనిల్ కృష్ణ పర్యవేక్షణలో ‘రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రైబల్స్ ఇన్ ద సెలెక్టెడ్ ఇండియన్ నావెల్స్ ఇన్ ఇంగ్లీష్‘ అనే అంశంపై మక్త పరిశోధన చేశారు.
పీహెచ్ డీ సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ అవార్డు ను ప్రకటించింది. డాక్టరేట్ సాధించిన మక్త స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామం. గ్రామం నుంచి తొలి డాక్టరేట్ పొందిన మక్తను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేశ్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి ఇందిరా, అకాడమీ కోఆర్డినేటర్ నర్సింహ, ఐ క్యూ ఏసీ కోఆర్డినేటర్ మధు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది డాక్టర్ మక్తాను అభినందించారు.