06-03-2025 01:03:26 AM
అమెరికాలోని హవాయి అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో 100 అడుగులకు పైగా లావా ఎగసిపడుతుంది. ప్రపంచంలోని అత్యంత చురుకైన కిలోవియా శిఖరంపై బిలం నుంచి గతేడాది డిసెంబర్ 23న విస్ఫోటనం మొదలైనట్టు అధికారులు తెలిపారు. క్రమంగా ఆ విస్ఫోటనం పెద్ద ఫౌంటెయిన్‌లా మారి అగ్నిపర్వతం ఒక్కసారిగా లావా ఎగిసిపడిందని హవాయి అగ్నిపర్వత అబ్జర్వేటరీ పేర్కొంది. ప్రస్తుతం లావా 150 నుంచి 165 అడుగుల వరకు ఎగసి పడుతోందని అధికారులు వెల్లడించారు.