calender_icon.png 24 October, 2024 | 8:48 AM

క్యాన్సర్ బాధిత చిన్నారితో సరదాగా..

21-07-2024 12:04:10 AM

హీరో అడివి శేష్ మరోసారి గొప్ప మనసును చాటారు. ఇటీవల క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ పాపతో రోజంతా కాలక్షేపం చేశారు. ఇండస్ట్రీకి చెందిన సన్నిహిత వ్యక్తి ద్వారా ఈ అభిమాని చిన్ని గురించి తెలుసుకున్న శేష్.. ఆమెను, కుటుంబ సభ్యులను సంప్రదించారు. వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. చిన్నారి మెసేజ్‌లకు రిప్లేయ్ ఇచ్చారు. ఒక హోటల్‌లో సదరు ఫ్యామిలీ కోసం డే అవుట్‌ను ప్లాన్ చేసి, అక్కడ చిన్నారిని కలిసి సర్ర్పైజ్ చేశారు. పాపతో శనివారం రోజంతా సరదాగా ఆడుతూ గడిపారు. అవసరమైనప్పుడు తన సపోర్ట్ ఉంటుందని మాట ఇచ్చారు. శేష్‌కు డై-హార్డ్ ఫ్యాన్ అయిన ఆ చిన్నారి తన అభిమాన హీరోను కలవాలని చాలా కాలంగా కలలు కనగా, ఇలా శేష్ ఆమె కలను నిజం చేయటం గొప్ప విషయం.