06-04-2025 12:00:00 AM
ఇంట్లో, పొలంలో పాము కనిపిస్తే అమ్మో అనుకుంటూ అక్కడి నుంచి పరిగెడతాం. కానీ ఈ పామును చూస్తే అబ్బా.. ఎంత అందంగా ఉందో.. అని అనుకుంటాం. అది అంత అందంగా కనిపించడానికి కారణం.. దాని శరీరం మొత్తం ఇంద్రధనస్సు రంగులతో నిండిపోవడమే. ఈ పొడవైన పాము పేరు ‘రెయిన్ బో పైథాన్’. ఈ రంగురంగుల పాము కాలిఫోర్నియాలోని ఫౌంటెన్ వ్యాలీలోని ది రిపైల్ జూలో జన్మించింది. దీనికి సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది.
అయితే ఈ భారీ పాముకు జే బ్యూవర్ అనే జూ కీపర్ మంచి మిత్రుడు. అన్ని సరీసృపాలను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకునే ఆయనకు ఈ పాముతో స్నేహం కుదుర్చుకోవడానికి చాలా సమయమే పట్టిందట. ఈ రెయిన్‌బో పాము ఒక యాంగిల్‌లో నీలం రంగులో కనిపిస్తుంది. కోణం మారిస్తే వివిధ రంగుల్లో కనిపిస్తుంది. ఆ రంగులు బౌన్స్ అవుతున్నప్పుడు పాము మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది.