హీరోయిన్స్ డైట్ గురించి తెలుసుకోవాలని, అదే ఫాలో అయ్యి సన్నగా మారాలని చాలామంది టీనేజ్ అమ్మాయిలు, మహిళలు అనుకుంటారు. అమ్మాయిలైతే అచ్చం హీరోయిన్‌లా ఉండేందుకు కడుపు మాడ్చుకుని డైట్ డైట్ అంటూ తినడం కూడా మానేస్తారు. ఇక బాలీవుడ్ హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు.
జీరో సైజ్ కోసం తినడం మానేసి జిమ్‌ల వెంట తిరుగుతారని అందరూ మాట్లాడుకుంటారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె ఇప్పుడు ప్రెగ్నెంట్. ఆమె ఇప్పటికి సన్నగానే కనిపిస్తుంది.అలా ఉండటానికి ఆమె ఏదో ఒక డైట్ ఫాలో అవుతుంది అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కానీ దీపికా పదుకొనె మాత్రం డైట్ అంటే కడుపు మాడ్చుకోవడం కాదు అంటుంది. డైట్ అనే పదం వెనుక చాలా అపోహలున్నాయి. డైట్ అంటే తక్కువ తినడం, కడుపు మాడ్చుకోవడం, ఇష్టం లేనివి తినడం అని మనం అనుకుంటాం. కానీ డైట్ అంటే మనం తీసుకునే ఆహారం, తీసుకునే నియమాలు మాత్రమే. డైట్ అనే పదం గ్రీకు పదం. డైట్ అంటే జీవన విధానం అంటూ దీపికా పదుకొనె డైట్ గురించి చెప్పుకొచ్చింది.