- నేరెళ్ల దళితులను హింసించిన నీవా మాట్లాడేది..?
- కేటీఆర్‌పై బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల ధ్వజం
ముషీరాబాద్, నవంబర్ 24: సీఎం రేవంత్‌రెడ్డిని నియంతఅంటూ విమర్శిస్తున్న కేటీఆర్‌కు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేసిన నిర్బంధం గుర్తుకు రాలేదా అని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను మించిన నియంత ఉన్నాడా అని ఆయన మండిపడ్డారు.
ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రైతుల కోసం పోరాటాలు చేస్తున్నాడని కేటీఆర్ మాట్లాడుతున్నారని, రైతుల నుంచే కమిషన్ తీసుకున్నోడు రైతు పక్షపాతి ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు.
షాబాద్ ఏరియాలో భూముల రిజిస్ట్రేషన్లు కావాలంటే పట్నం పన్ను కట్టాల్సిందేనని, టాటా కంపెనీ కూడా పట్నం పన్నులు కట్టలేకే కలకత్తాకు వెళ్లిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా వెనకబడిన కొడంగల్‌లో పరిశ్రమలు వస్తే ఓర్చుకోవట్లేదని అన్నారు. రైతులకు సంకేళ్లేసిన, నేరెళ్ల దళితులను హింసించిన సంఘటనలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదన్నారు.