రోహిత్, కోహ్లీకి అండగా నిలిచిన యువరాజ్
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సాధించిన ఘనతలను ప్రజలు అంతా మరిచిపోయారని మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. బోర్డర్ గావస్కర్ సిరీస్‌లో భారత్ ఓటమికి ఈ ఇద్దరినే టార్గెట్ చేయ డం కరెక్ట్ కాదని తెలిపాడు. ‘నా వర కు బోర్డర్ సిరీస్ ఓటమి కంటే స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ అవడం బాధ కలిగించింది.
సొంతగడ్డపై ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేరు. గతంలో ఆసీస్‌లో పర్యటించిన రెం డు సందర్భాల్లో భారత్ గెలిచింది. ఈ రెండు దఫాల్లో టీమిండియా విజయాల్లో రోహిత్, కోహ్లీ ముఖ్యపాత్ర పోషించారు. ఈసారి ఆ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. భారత్ ఓటమికి ఈ ఇద్ద రినే టార్గెట్ చేయడం నాకు నచ్చలేదు. కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో మనందరికి తెలుసు.
కొన్నేళ్లుగా భారత బ్యాటింగ్‌కు అతడు వెన్నుముకగా నిలుస్తూ వస్తున్నాడు. ఇక రోహిత్ శర్మ సారధ్యంలో టీమిండియా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌ను గెలిచాం. ఈ ఇద్దరు సాధించిన ఘనతలను ప్రజలు అంతా మరిచిపోయారు. జట్టు ప్రయోజనాల కోసం సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ తప్పుకోవడం అతడి హుందాను చూపించింది. ఓడినా, గెలిచినా అతడు గొప్ప కెప్టెన్లలో ఒకడు. ఈ సమయంలో రోహిత్, కోహ్లీకే ఎల్లప్పుడూ నా మద్దతు’ అని చెప్పుకొచ్చాడు.