02-03-2025 12:14:36 AM
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉండుకుం టూ ఆపార్టీ నేతలనే పొట్టు పొట్టు తిట్టేటోడు. పార్టీ నిర్ణయాలను, ప్రభుత్వ కార్యక్ర మాలను వ్యతిరేకిస్తూ పక్కలో బల్లెంలా మారిపోయాడు మల్లన్న. ఇదేంది మల్లన్న కాం గ్రెస్ పార్టా? అపొజిషన్ పార్టా? అని క్యాడర్ బిత్తరపోయేటోళ్లు. ఇక మొన్నటి కులగణన విషయంలో మల్లన్న కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన తీరు చూస్తే వామ్మో అనిపించింది.
బీసీల లెక్కలు తప్పంటూ ఏకంగా సర్వే రిపోర్టును తగలబెట్టమని.. ఇది సర్వే రిపోర్టు కాదని చిత్తుకాగితంతో సమానమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న మాటలు అపొజిషన్ పార్టీలకు అస్త్రాలయ్యాయి. సొంతపార్టీ నాయకులే కులగణన సర్వే తప్పులతడకంటూ విమర్శలు చేశారంటూ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీశాయి.
దీంతో రీసర్వే చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఓ వర్గాన్ని కించపరిచేవిధంగా మాట్లాడటం, పార్టీ అగ్ర నాయకులను తీవ్రంగా విమర్శించడం..రాష్ట్ర నాయకత్వానికి కోపం వచ్చింది. ఇక ఆయన్ను పార్టీ లో ఉంచుకోవడం కంటే బయటికి పంపిస్తేనే బెటర్ అని భావించింది.
పార్టీ వ్యతిరేక చర్యలపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. అయితే మల్లన్న వివరణ ఇవ్వకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తీన్మార్ మల్లన్నను కావాలనే కాంగ్రెస్ పార్టీ వదిలించుకున్నదనే చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది.
రమేశ్ మోతె