calender_icon.png 17 January, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారంలో 3రోజులు ఆఫీస్‌కు రావాల్సిందే

18-09-2024 01:27:23 AM

ఉద్యోగులకు విప్రో కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: టెక్ దిగ్గజ సంస్థ విప్రో ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ కి పరిమితమైన తమ ఉద్యోగులు ఇకనుంచి వారంలో మూడురోజుల డైరెక్ట్‌గా విధులు నర్విర్తించేందుకు ఆఫీస్‌కు రావాలని స్పష్టం చేసింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పీరియడ్‌లో ఎవరైతే హాజ రు కారో ఆరోజున వారికి సెలవు దినంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు సెప్టెంబర్ 2న తన ఉద్యోగులకు విప్రో కొత్త పాలసీకి సంబంధించి మెయిల్ పంపింది. 

కరోనా ఎఫెక్ట్‌తో వర్క్ ఫ్రమ్ హోమ్..

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విజృంభించిన సమయంలో మెజార్టీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడినప్పటికీ.. ఐటీ రంగం మాత్రం చెక్కుచెదరలేదు. ఇంకా ఆ సమయంలో ఆన్‌లైన్ యూజర్లు ఎక్కువవడం, డిజిటలైజేషన్ వైపు ప్రజలు మళ్లడంతో ఐటీ కంపెనీలకు ఎక్కువ ప్రాజెక్టులు లభించడం మెదలయ్యింది. ఈ క్రమం లో నేరుగా ఆఫీస్‌కి వచ్చి పనిచేసే అవకాశం లేనప్పటికీ.. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు పని కల్పించా యి. ఈ విధానంలో పలు కంపెనీలు ఆర్థికం గా చాలా బలపడ్డాయి.

ఆఫీస్ స్పేస్ రెంట్ లేకపోవడం, విద్యుత్, మెయింటెనెన్స్ చార్జీలు లేకపోవడం, ట్రాన్స్‌పోర్టు ఖర్చు లేకపోవడం ఇలా అనేక సౌకర్యాలు కల్పించ కుండానే ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయ డం ప్రారంభించడంతో.. గతేడాది వరకు ప్రముఖ ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించాయి. అయితే క్రమే పీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఆసరాగా చేసుకొని రెండు అంతకంటే ఉద్యోగాలు చేయడం, చేసే పనిపై ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడంతో ప్రాజెక్టులను లేటుగా సమర్పించడం వంటివి చేయడం మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో కంపెనీలు మరోసారి తీవ్ర నష్టాలు చవిచూస్తున్న క్రమంలో.. మెజార్టీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానానికే పట్టం కడుతున్నాయి.