calender_icon.png 4 March, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరగా పిల్లల్ని కనండి

04-03-2025 02:15:20 AM

  1. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
  2. రేపు అఖిలపక్ష సమావేశం

చెన్నై, మార్చి 3: డీలిమిటేషన్ రచ్చ తమిళనాడును ఊపేస్తోంది. డీలిమిటేషన్ కనుక జరిగితే తమిళనాడు 8 ఎంపీ సీట్లను కోల్పోవాల్సి వస్తుందని స్టాలిన్ చెబుతున్నారు. అటువంటిదేం లేదని కేంద్ర పెద్దలు చెబుతున్నా కానీ డీఎంకే నేతలు మాత్రం వినట్లేదు. ఈ ఆంశం మీద చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.

అంతే కాకుండా వీలైనంత తొందరగా పిల్లల్ని కనమని కొత్త జంటలను స్టాలిన్ కోరారు. ‘ఒకప్పుడు నెమ్మదిగా అన్నీ ఆలోచించుకుని పిల్లల్ని కనమని మేమే చెప్పాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి వీలైనంత త్వరగా పిల్లల్ని కండి. జనాభా నియంత్రణ పద్ధతులను సమర్థవంతంగా అమలు చేసినందుకు తమిళనాడుకు ఈ పరిస్థితి తలెత్తింది.

డీలిమిటేషన్ వల్ల రాష్ట్రానికి ఏర్పడే పరిస్థితులపై రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాం. రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు హాజరు కావాలని కోరుతున్నా. ఒక వేళ డీలిమిటేషన్‌ను కనుక జనాభాను బట్టి అమలు చేస్తే తమిళనాడు 8 ఎంపీ సీట్లను కోల్పోవాల్సి వస్తుంది’. అని ఆయన పేర్కొన్నారు.