calender_icon.png 18 November, 2024 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాట్సాఫ్ పంత్: రవిశాస్త్రి

11-06-2024 01:07:59 AM

మృత్యు ముఖం నుంచి.. బెస్ట్ ఫీల్డర్‌గా

న్యూయార్క్: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని తెలియగానే కన్నీళ్లు తన్నుకొచ్చాయని మాజీ ఆల్‌రౌండర్ రవిశాస్త్రి గుర్తుచేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దాయాది పాకిస్థాన్‌పై విజయం అనంతరం.. ఫీల్డింగ్‌లో అత్యుతమ ప్రదర్శన కనబరిచిన పంత్‌కు రవిశాస్త్రి ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్ ప్రధానం చేశాడు. ఈ మెడల్‌కు పంత్, సూర్యకుమార్, అర్ష్‌దీప్ పోటీ పడగా.. పంత్ పురస్కారం దక్కించుకున్నట్లు  ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రకటించాడు. కాగా రవిశాస్త్రి పంత్‌కు ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్ అందిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.

ఈ నేపథ్యంలో రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘ రిషబ్‌ను వరల్డ్‌కప్‌లో చూడడం ఆనందంగా ఉంది. అతడు అంచనాలకు మించి రాణిస్తున్నాడు. 2022 డిసెంబర్‌లో పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని తెలియగానే కన్నీళ్లు వచ్చాయి. పంత్ గాయాలతో ఆసుపత్రి మంచంపై పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయా. కానీ గోడకు కొట్టిన బంతిలా కోలుకొని తిరిగి వచ్చిన పంత్ సత్తాచాటడం ప్రశంసనీయం. శస్త్రచికిత్సల తర్వాత మైదానం లో దిగి చురుగ్గా కదలడం అద్బుతం’ అని తెలిపాడు. పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా తన తర్వాతి మ్యాచ్ బుధవారం అమెరికాతో ఆడనుంది.