calender_icon.png 17 November, 2024 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాట్సాఫ్ నిర్వాణ్!

09-11-2024 12:00:00 AM

నిర్వాణ్ సోమాని.. ఢిల్లీకి చెందిన 18 ఏళ్ల యువకుడు. తనకు వచ్చిన ఒక చిన్న ఆలోచన జీవితాన్ని మార్చేసింది. ఢిల్లీ మహా నగరంలో.. రోడ్లపై ఉండే వృద్ధులను, గూడులేని వాళ్లను, అనాథపిల్లలను వారి కష్టాలను చూసి చలించిపోయాడు. మరోవైపు లగ్జరీ లైఫ్, ఫ్యాషన్ పేరుతో యువత అవసరానికి మించి దుస్తులు కొనడాన్ని చూశాడు. అవి కొంచెం రంగు మాసిన, పాతబడ్డ ల్యాండ్ ఫిల్లింగ్స్‌లోకి వెళ్లి పర్యావరణానికి హానిచేయడన్ని గమ నించాడు.

అయితే మందంగా, చలికి తట్టుకొనేలా ఉండే జీన్స్‌ని మున్సిపాలిటీ చెత్తలోకి వెళ్లనివ్వకుండా వాటితో ఇల్లు లేనివారి కోసం స్లీపింగ్ బ్యాగ్స్ తయారు చేయాలనుకున్నాడు. అలా తన స్నేహితుల నుంచి పాత జీన్స్‌ని సేకరించాడు. నిర్వాణ్ తల్లి శివాని బొతిక్ నడుపుతున్నది. ఆమె సాయంతో వాటిని చక్కని బ్యాగులుగా తయారు చేసి పేదలకు పంచడం మొదలు పెట్టాడు. ఒక్కో బ్యాగుకి ఏడు జీన్స్ ప్యాంటులు అవసరం అవుతాయి.

వాటి కోసం వాట్సాప్ గ్రూపుల్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పిలుపుని చ్చాడు. బెంగళూరు, పుణె, చెన్నై నగరాల నుంచి జీన్స్‌ప్యాంట్లు వచ్చాయి. అలా జీన్స్‌లతో తయారుచేసిన 12,000 స్లీపింగ్ బ్యాగులని ఢిల్లీ , బెంగళూరు, పుణెలతో పాటు తుర్కియే, సిరియా వంటి చోట్లకు పంపిస్తున్నాడు నిర్వాణ్. అతి తక్కువకాలంలో విశేష స్పందన లభించింది. కొన్ని కార్పొరేట్ సంస్థలైతే నిధులూ కూడా అందించాయి.