calender_icon.png 15 March, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీలిమిటేషన్‌పై విద్వేషాలు

15-03-2025 12:42:36 AM

  1. దక్షిణాదిన సీట్లు తగ్గుతాయంటూ బీజేపీపై డీఎంకే విష ప్రచారం
  2. ఇంటిపోరు, బయటి పోరు తట్టుకోలేకే బీజేపీపై రేవంత్ నిందలు
  3. ఎంపీ సీట్లపై కాదు.. కాంగ్రెస్ పార్టీ హామీలపై
  4. అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: బీజేపీ ఎంపీ డా. కే లక్ష్మణ్

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి) : ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేక తను కప్పిపుచ్చుకునేందుకు డీఎంకే, కాం గ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని బీజేపీ ఓబీ సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కే లక్ష్మణ్ ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎంపీ సీట్లు కోల్పోతా యని డీఎంకే విష ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు.

బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో శుక్రవారం లక్ష్మణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశాన్ని కాంగ్రెస్ హిందూ, ముస్లింలుగా విభజించిందని.. ఇప్పుడు ఉత్తర, దక్షిణ భారత దేశం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేతులు కలిపాయని.. అందు కు డీఎంకే ఏర్పాటు చేసిన అఖిలపక్షంమే ఉదాహరణ అన్నారు.

దక్షిణాదిన ఎంపీలను తగ్గించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని డీఎంకే అంటోందని కానీ బీజేపీ దక్షిణాదిలో క్రమంగా బలపడుతుంటే తట్టు కోలేక డీఎంకేనే ఇలాంటి ప్రాంతీయవాద కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపిం చారు. కర్నాటకలో గాలిలో దీపంలా సిద్దరామయ్య ప్రభుత్వం కొనసాగుతున్నదని, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇంటి పోరు..

బయట పోరు తట్టుకోలేకపోతున్నారని, డీఎంకే రాబోయే ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పి ఓట్లు అడగాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని.. ఈ విధంగా ఈ మూడు పార్టీలు తమపై ఉన్న ప్రజా వ్యవతిరేకతను తప్పించుకునేందుకు బీజేపీపై, కేంద్రం పై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కూడా కోల్పోయిందని.. బీజేపీ మాత్రం రెండు ఎమ్మెల్సీ స్థానాలతో, దక్షిణాదిలో బీజేపీ ఎక్కడుంది అని ప్రశ్నించిన వాళ్లకు గట్టి సమాధానం ఇచ్చిందన్నారు. తమపై ఆరోపణలు చేసే పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కనువిప్పుగా పేర్కొన్నారు.

డీఎంకే అఖిలపక్ష సమావేశా నికి హాజరవుతానని రేవంత్ రెడ్డి, కేటీఆర్ చెబుతున్నారని.. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 హామీలపై అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజాంగ ప్రక్రియ అని.. ఈ అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు.

ఎంపీ సీట్లు పెరగడం వల్ల ఎస్సీ, ఎస్టీలకు రాజకీయంగా ప్రాధాన్యత దక్కుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సీట్లు దక్కుతా యనే డిలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నా రా అని ఆయన ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు.