14-04-2025 07:49:01 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లెందు-1 ఎస్సైగా హసీనా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2020 ఎస్ఐ బ్యాచ్ కు చెందిన హసీనా మొదట మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీ కోర్ లో విధులు నిర్వహించారు. ఇల్లందు ఎస్సై గా పనిచేస్తున్న నాగుల్ మీరా పఠాన్ బదిలీ కావడంతో ఇల్లందు 1 ఎస్సైగా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై హసీనా మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం ఇల్లందు డిఎస్పి ఎన్. చంద్రభాను, సీఐ బత్తుల సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిశారు.