ఢాకా, నవంబర్ 1: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీ కార్యాలయంలో కొందరు దుండగులు విధ్వంసం సృష్టించారు. ఢాకాలోని అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయంలోకి చొరబడిన దుండగులు ఆఫీసును ధ్వంసం చేశారు. అనంతరం నిప్పు పెట్టారు. కాగా.. కొద్ది నెలలుగా బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి.
2018లో రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన హసీనా ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో వాటిని మళ్లీ పునరుద్దరించనున్నట్టు ప్రకటించారు. దీంతో బంగ్లా యువత ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి ఇండియాకు వచ్చేశారు.