* నలుగురి అరెస్టు
అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 24: నూతన సంవత్సర వేడుకల కోసం ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న హష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకుని, నలుగురిని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 4 లీటర్ల హష్ ఆయిల్, 4 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన చిన్నా అనే వ్యక్తి హష్ ఆయిల్ కావాలని ఒడిశాలోని మల్కాన్‌గిరికి చెందిన జైదేబ్ హల్డర్‌కు ఆర్డర్ పెట్టారు.
హష్ ఆయిల్‌ను హల్డర్ మరో ముగ్గురు స్నేహితులు దేబమది, జితేంద్ర పంగి, ఆకాశ్ సర్కార్‌తో కలిసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నగరశివారులో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు వీరుపట్టుపడ్డారు. వనస్థలిపురంలో ఉంటున్న చిన్నాను త్వరలో అరెస్టు చేస్తామని సీఐ అంజిరెడ్డి తెలిపారు.