calender_icon.png 21 April, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనుషుల్లో నేర స్వభావం మారదా?

20-04-2025 12:00:00 AM

ఇటీవల కేంద్రమంత్రి రక్షాఖడ్సే 

కుమార్తె లైంగిక వేధింపులకు గు రయ్యారు. ముగ్గురు స్నేహితులతో కలిసి జల్గావ్ జిల్లాలో జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో కేంద్రమంత్రి కూతురు పాల్గొన్నా రు. ఈ సమయంలో కొందరు ఆకతాయి లు వాళ్ల వెంటపడి వేధించారు. దీంతో ఖ డ్సే ఆగ్రహానికి లోనై స్వయంగా స్థానిక పో లీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇంతేకాదు, గతంలో ముఖ్యమంత్రిగా పని చే సిన కర్ణాటకకు చెందిన ఓ కాషాయ పార్టీ నేత లైంగిక వేధింపుల కేసులో నిందితుడి గా ఉన్నారు.

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అనేక మంది మహిళల్ని మానభంగం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే, కొన్నాళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోనూ వేధింపులకు గురైన ముగ్గురు మైనర్ బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానా లో కూడా కొందరు గుర్తు తెలియని వ్య క్తులు కాంగ్రెస్ మహిళా కార్యకర్తను కిరాతకంగా చంపి, సూట్‌కేస్‌లో కుక్కి పడేసిన వార్త చదివాం.

యూపీలోని హత్రాస్‌లో దళిత మహిళలను కొందరు దుండగులు మానభంగం చేసి, హత్య చేశారు. మణిపూర్‌లో ఓ మహిళను నగ్నంగా ఊరేగించడ మేకాక తర్వాత హతమార్చారు. 

ఇలా దేశంలో ప్రతి రోజూ ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలు జరుగుతూ నే ఉన్నాయి. గతంలోనూ ఈ దుర్ఘటనలు జరిగాయి. కానీ, ఇప్పుడు అంతకన్నా ఎ క్కువగా జరుగుతున్నాయి. గత రెండు మూడేళ్లుగా మతం, వర్గం పేరుతో పేరు తో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, హింసలు మితిమీరి పోయాయి. ఎన్ని చట్టాలు ఉన్నా వాటిలోని లొసుగులను అడ్డు పెట్టుకుని తప్పు చేసిన వాళ్లు తప్పించుకుంటూ సమాజంలో యథేచ్ఛగా తిరు గుతున్నారు.

దీనికి ఉదాహరణ బిల్సిస్ బా నో కేసు. సమాజంలో మార్పు రావాలం టే అది ముందుగా మన ఇంటినుంచే మొ దలు కావాలి. ద్వేషం, అసూయ, అజ్ఞానం, అవివేకం గలవారు అధికారంలో ఉంటే ఇటువంటి సమస్యలకు సరైన పరిష్కారం లభించదు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన రెజ్లర్లపై లైంగిక వేధింపులకు గురిచేసిన వారు తిరిగి అందలం ఎక్కుతున్న సందర్భాలను చూస్తున్నాం.

మహిళలనే బాధ్యులను చేస్తే ఎలా?

ఓవర్సీస్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పై అనేక లైంగిక ఆరోపణలు ఉన్నాయి. మహిళలు స్కర్టులు వేయడం వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఒకరు అం టే, సభ్య సమాజం గౌరవించేలా మహిళల వస్త్రధారణ ఉండాలని మరొకరు అంటా రు. ఎంతసేపు మహిళలకు జరిగిన అన్యాయాలకు వారినే బాధ్యులను చేస్తున్నారే తప్ప, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవడం లేదు.

స్త్రీల సంక్షేమం కేవలం నినాదాలకే పరిమితమవుతున్నది. స్త్రీల పవిత్రతను శీలానికి ముడి పెడుతూ సమాజం ఇచ్చిన ప్రాముఖ్యమే ఈ దాడులు, భావజాలానికి ప్రధాన కార ణం. సాహిత్యం, సినిమాల్లో కూడా మహిళల పవిత్రతను శీలంతో ముడిపెట్టారు. ఈ క్రమంలోనే స్త్రీని అణచి వేయడానికి కొందరు లైంగిక, శరీర భాగాలపై దాడిని ప్రధాన ఆయుధంగా ఎంచుకుంటున్నారు.

మహిళను ఒక లైంగిక వస్తువుగా, రంగు, అందంతో పోల్చి చూస్తున్నారు. ఒకవైపు స్త్రీని దేవతగా భావించే గొప్ప సంస్కృతికి పరిరక్షకులం అని చెప్పుకుంటేనే వాళ్లను అవమానిస్తూ విరుద్ధ భావాలను ప్రదర్శిస్తున్నారు. ఏడాది వయసున్న చిన్నారి నుంచి వృద్ధురాలు కూడా అత్యాచారం నుంచి తప్పించుకోలేని దారుణ దుస్థితి ప్ర స్తుతం నెలకొంది. సినిమాలు, సీరియళ్లలో పెడ ధోరణలు ఎక్కువై పోతున్నాయి. బూ తు కంటెంట్ ఉన్న సినిమాలకు కాసుల వ ర్షం కురుస్తుండడం దురదృష్టకరం. ఇవి సమాజంపై చాలా ప్రభావం చూపుతున్నాయి. 

మన భాష, వ్యవహారం చూస్తే కేవలం అనుకరణ మాత్రమే కనపడుతుంది. కానీ విలువలు, సంస్కారాలకు చాలామంది ఎప్పుడో మడత పెట్టేశారు. చట్టసభలు వ్యవస్థలకు దిశానిర్దేశం చేస్తాయి. అందువల్ల ప్రజాప్రతినిధులు అత్యంత బాధ్యతా యుతంగా వ్యవహరించాలి. కానీ, వారు అలా వ్యవహరించడం లేదు. హుందాగా వ్యవహరించాల్సిన సభల్లో జుగుప్సాకరంగా బూతులు మాట్లాడుతున్నారు.

చట్ట సభ్యుల మధ్య జరుగుతున్న చర్చను గమనిస్తే సమాచారం తెలుస్తుందనే విషయా న్ని అటుంచితే పిల్లలు కొత్త బూతులు నేర్చుకునే ప్రమాదం ప్రస్తుతం ఏర్పడింది. కొందరు ప్రజాప్రతినిధులు పవిత్రమైన చట్టసభల్లోనే నీలిచిత్రాలను వీక్షించిన సం దర్భాలూ ఉండటం దురదృష్టకరం. సభ్యు లు మాట్లాడే భాష వింటుంటే విలువలు నశించిపోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది.

కారణమేదైనా మనిషి వావివరసలు మర్చిపోతున్నాడు. ‘మీది అంటే మీదే త ప్పు’ అంటూ అని ఒకరి నొకరు నిందించుకోవడం కాకుండా, వ్యవస్థ మొత్తంగా ఆలోచించాలి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కనీసం ఖండించని నా యకులను ఏమనాలి? చట్టసభల్లోకి వెళ్తు న్న వారి ఆలోచనలు మారాల్సిన అవస రం ఉంది.

ఎప్పట్నుంచి మొదలైంది?

ఒక మహిళ తనపై ‘లైంగికదాడి జరిగిం ది, న్యాయం చేయండి’ అంటూ వేడుకుం టే ఆమె చెప్పేది తప్పని నిరూపించేందుకు లైంగిక సంబంధాలను కొందరు చర్చల్లోకి తెస్తున్నారు. ఆఖరుకు మరణించిన కుటుం బ సభ్యులను కూడా చర్చల్లోకి లాగుతూ ట్రోల్స్ చేస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధోరణి ఎప్పటి నుంచి మొ దలైంది? ఈ వైఖరివల్ల బాధిత మహిళ, వారి కుటుంబ సభ్యులపై మానసిక ఒత్తిడి ఎలా ఉంటుంది? అనే విషయాన్ని ఆలోచించాలి.

గత నాలుగేళ్లుగా ఈ వైఖరి మ రింత పెరిగింది. బాధిత స్త్రీ తరఫున మా ట్లాడే మహిళలనూ వదలట్లేదు. ట్రోలర్స్ దృష్టిలో విలువలు అంటే దూషించడం, అవమానించడమేనా? టెక్ ఫాగ్ అనే యాప్‌ద్వారా అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు కొంతమంది ప్రముఖులు, మహి ళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని ‘వైర్’ పత్రిక ఇటీవల ఒక కథనంలో పేర్కొంది.

ముఖ్యంగా తమకు అ నుకూలంగా లేని మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని, వారిని అవమాన పరి చి, వేధించడమే పాలకవర్గం లక్ష్యంగా పెట్టుకుందనేది ఆ కథనం సారాంశం. దే శానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ, నెహ్రూలతోపాటు ఉక్కు మహిళగా గుర్తింపు పొం దిన ఇందిరాగాంధీ పైనా వక్రభాష్యం చె బుతూ రూపొందించిన అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొ డుతున్నాయి.

ఎటువంటి పనీ పాట లేని కొందరు వ్యక్తులు ఇటువంటి వీడియోల ను ఇతరులకు పంపించడమే పనిగా పెట్టుకుంటూ అసత్యాలను ప్రచారం చేయ డంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2021 లో జనవరి మధ్య ‘వైర్’ నిర్వహించిన పరిశోధనలో మహిళా జర్నలిస్టులు చేసిన ట్వీట్లకు 4.6 మిలియన్ సమాధానాలు రా గా, అందులో 18 శాతం అంటే 8 లక్షలకు పైగా సమాధానాలు టెక్ ఫాగ్ నిర్వహిస్తు న్న అకౌంట్ల నుంచే వచ్చినట్టు తేలింది. అందులో 67 శాతం  సమాధానాలు అవమానకరంగా, వేధింపులతో కూడుకుని ఉండటం గమనార్హం. 

సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ ధో రణి, సమాజం సాధించిన అభ్యుదయాన్ని నాలుగు దశాబ్దాల వెనక్కి లాక్కొచ్చినట్లు గా అనిపిస్తోంది. దీనిని కచ్చితంగా అధికారిక శక్తుల సహాయంతో జరుగుతున్న పని గానే భావించవలసి ఉంది. నిజానికి సమా జం మారలేదు. ఇది టెక్నాలజీ ద్వారా కొ న్ని వర్గాలు తమ నమ్మకాలను సమాజం లో నాటేందుకు చేస్తోన్న ప్రయత్నం.

వేధింపులకు పాల్పడే వారి భాషకు, ఆలోచన లకు మూలం ఎక్కడ? ఏ ధర్మం మనిషిని, మహిళలను అవమాన పర్చమని చెబుతోంది? వేధింపులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకున్న నాడే వాటిని అరికట్ట డం సాధ్యమవుతుంది. వేధింపులతో కూడి న పోస్టులు, ట్వీట్లపై చర్యలు తీసుకునే విధంగా ఐటీ చట్టాల్లో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉంది.

వ్యాసకర్త సెల్: 9989988912