calender_icon.png 23 September, 2024 | 1:52 AM

కట్ట తెగిందా.. పొలాలు గోవిందా!

23-09-2024 12:03:21 AM

నల్లగొండ(విజయక్రాంతి)/వేములపల్లి, సెప్టెంబర్ 22: నల్లగొండ జిల్లాలో పలుచోట్ల సాగర్ ఎడమ కాల్వ కట్ట కోతకు గురై బలహీనంగా మారింది. 2014లోనే రూ.వేల కో ట్లు వెచ్చించి కాల్వ ఆధునీకరణ పనులు చేపట్టినా ఇప్పటికీ చాలా చోట్ల కట్ట అధ్వానంగా ఉంది. పనుల్లో నాణ్యతా లోపం కారణంగా కొన్ని నెలల్లోనే చాలాచోట్ల సీసీలైనింగ్ దెబ్బతిన్నది. కట్టల వెంట మట్టి సైతం కోతకు గుర వుతుండటంతో స్థానిక రైతుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే పలుచోట్ల కట్ట తెగి పొలాల్లో ఇసుక మేట వేసి సాగుకు పనికిరాకుండా పోయాయి. అయినా కూడా ఎన్నెస్పీ అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. వేములపల్లి మండలం సల్కునూరు ఎల్-1 8,19 ఎత్తిపోతల సమీపంలో కట్ట తీవ్రంగా కో తకు గురైనా అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం పర్యవేక్షణకు అద్దం పడుతున్నది.