calender_icon.png 29 December, 2024 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో హర్యానా, పట్నా పైరేట్స్

28-12-2024 01:09:49 AM

పీకేఎల్ 11వ సీజన్

పుణే: మూడు నెలలుగా కబడ్డీ ప్రియులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ఆఖరి మజిలీకి చేరుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్లో హర్యానా స్టీలర్స్, పట్నా పైరేట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. శుక్రవారం పుణే వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో హర్యానా స్టీలర్స్ 28 యూపీ యోధాస్‌ను మట్టికరిపించింది.

హర్యానా తరఫున రెయిడర్లు శివమ్ పటారే (7 పాయింట్లు), వినయ్ (6 పాయింట్లు) రాణించారు. హర్యానా స్టీలర్స్ పీకేఎల్‌లో ఫైనల్లో అడుగుపెట్టడం ఇది వరుసగా రెండోసారి. గతేడాది పుణేరి పల్టన్ చేతిలో ఓడిన హర్యానా రన్నరప్‌కే పరిమితమైంది. ఈసారి మాత్రం టైటిల్ కొట్టాలనే కృత నిశ్చయంతో ఉంది. ఇక రెండో సెమీస్‌లో పట్నా పైరేట్స్ 32 తేడాతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది.

పట్నా స్టార్ రెయిడర్స్ దేవాంక్, అయాన్ చెరో 8 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన పట్నా పైరేట్స్ ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. కాగా 11 సీజన్లలో ఏడుసార్లు ప్లేఆఫ్స్ దశను దాటి అత్యంత విజయవంతమైన జట్టుగా పట్నా పైరేట్స్ రికార్డులకెక్కింది.