calender_icon.png 9 October, 2024 | 7:52 AM

హస్తానికి హర్యానా షాక్

09-10-2024 01:19:19 AM

ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తలకిందులు

90 సీట్ల అసెంబ్లీలో 48 చోట్ల బీజేపీ గెలుపు

కాంగ్రెస్‌కు షాకిచ్చిన జాట్లు, రెబల్స్

అధికారం తథ్యమన్న చోట 37 సీట్లకే పరిమితం

అరశాతం ఓట్ల తేడాతో 10 సీట్లు కోల్పోయిన కాంగ్రెస్

చిన్న పార్టీల అడ్రస్ గల్లంతు

చండీగఢ్, అక్టోబర్ 8: లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారి నిర్వహించిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఊహించుకొని వెళ్లకిలా పడింది. సా ర్వత్రిక ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు బయటపడిన బీజేపీ మళ్లీ తన దమ్ము చూపించింది.

మంగళవారం వెల్లడైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీ సంపూ ర్ణ మెజారిటీ సాధించింది. 90 సీట్ల అసెంబ్లీలో ఆ పార్టీ ఏకంగా 49 సీట్లు గెలుచు కొన్నది. ఇక్కడ కాంగ్రెస్ 55 సీట్లు గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేయగా, 36 సీట్లకే పరిమితమైంది.

దీంతో బీజేపీ హ్యాట్రిక్ సాధించగా, కాంగ్రెస్ మరో ఐదేండ్లు ప్రతిపక్షంలోనే కూర్చోనున్నది. ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికర విషయం ఏమిటంటే రాష్ట్రంలోని చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కింగ్ మేక ర్లుగా అవతరించాలనుకొన్న ఐఎన్‌ఎల్డీ, జేజే పీ కూటముల అడ్రస్ గల్లంతైంది. 

చిన్న పార్టీలు గల్లంతు

ఈసారి హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్డీ), జననాయక్ జనతా పార్టీ (జజేపీ) మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి వేర్వేరుగా కూటములు కట్టాయి.

ముఖ్యంగా రాష్ట్రంలో దళితుల ఓట్లే దాదాపు 30 శాతం ఉండటంతో ఆ ఓట్లకు గాలం వేసేందుకు పొరుగు న ఉన్న దళితవాద పార్టీలైన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్‌పీ)లను దిగుమతి చేసుకొన్నా యి. ఏఎస్‌పీతో జేజేపీ, బీఎస్పీతో ఐఎన్‌ఎల్డీ జట్టుకట్టి పోటీలోకి దిగాయి. జేజేపీ 2019 ఎన్నికల్లో 10 సీట్లు గెలిచి బీజేపీ ప్రభుత్వంలో కింగ్‌మేకర్‌లా అధికారం చెలాయిం చింది.

ఈసారి కూడా అదే ఫలితం సాధించాలని ఉవ్విళ్లూరింది. మరోవైపు కోల్పో యిన తన ప్రభను తిరిగి సంపాదించేందుకు ఐఎన్‌ఎల్డీ పోరాడింది. కానీ, జేజేపీ చేతిలో ఉన్న పది సీట్లనూ కోల్పోగా, ఐఎన్‌ఎల్డీ గత ఎన్నికల్లో సాధించిన ఒక్కస్థానానికి ఈసారి మరొకటి కలుపుకొని రెండు సీట్లు గెలిచింది.

విచిత్రం ఏమిటంటే ఇక్కడ ఈ రెండు పార్టీలకు స్వతంత్ర అభ్యర్థులకు వచ్చినన్ని ఓట్లు గానీ, సీట్లుగానీ రాకపోవటం. స్వతంత్రులం తా కలిసి పోలైన ఓట్లలో 13 శాతం సాధించగా, జేజేపీ 0.90 శాతం ఓట్లకే పరిమితమై తుడిచిపెట్టుకుపోయింది. ఈ పార్టీకంటే బయటి పార్టీ అయిన బీఎస్పీ ఎంతో మెరుగ్గా 1.82 శాతం ఓట్లు సాధించింది. ఇక ఐఎన్‌ఎల్డీ 4.14 శాతం ఓట్లు గెలుచుకొన్నది. 

కాంగ్రెస్‌ను ముంచిన అంతఃకలహాలు

హర్యానాలో కాంగ్రెస్ పార్టీని అంతర్గత కలహాలే దెబ్బకొట్టాయని తెలుస్తున్నది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఇద్దరు పెద్ద దిక్కులాంటి నేతలు ఉన్నారు. ఒకరు దళిత నాకురాలైన కుమారి షెల్జా, మరొకరు మాజీ సీ ఎం భూపిందర్‌సింగ్ హుడా. వీరిద్ద రూ మొదటి నుంచి ఉత్తర దక్షిణ దృవాలుగా ఉంటూ పార్టీలో ఐక్యత రాకుండా చేశారనే విమర్శలున్నాయి.

ఇక్కడ ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని మోదీ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తటం గమనార్హం. కాంగ్రెస్‌కు ఓటేస్తే కుర్చీలకోసం వారిలో వారు కొట్టుకోవటం తప్ప ప్రజలకు ఏమీ చేయరని మోదీ ప్రచారం చేశారు. అది ఓటర్లపై బలంగానే పనిచేసినట్లు విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పోటీలో నిలిపిన అభ్యర్థుల్లో 70 మంది హుడా వర్గం వారు ఉండగా, షెల్జా వర్గానికి 9 టికెట్లే లభించాయి.

దీంతో ఆమె సహాయ నిరా కరణ చేశారు. మ్యానిఫెస్టో విడుదల వేడుకకు కూడా సెల్జా హాజరుకాలేదు. హు డా అభ్యర్థులున్నచోట ఆమె ప్రచారమే చేయలేదు. రణ్‌దీప్ సుర్జేవాలా, కిరణ్‌చౌదరి కూడా హుడాకు సహాయ నిరాకరణ చేయటం లో క్షేత్రస్థాయిలో పార్టీలోని వర్గాలన్నీ కలిసి పనిచేయలేదు. రాష్ట్రంలో రాజకీయంగా జాట్లు బలంగా ఉండగా, ఓట్ల పరంగా దళితులు బలంగా ఉన్నారు.

అయితే, కాం గ్రెస్ పార్టీ జాట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి 17 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలున్నప్పటికీ దళితులను పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఓట్ల సరళిని పరిశీలిస్తే కనీసం 18 నుంచి 20 చోట్ల గెలిచిన, ఓడిన అభ్యర్థులకు  ట్ల తేడా వెయ్యి రెం డువేల లోపే ఉన్నది. కాంగ్రెస్‌లోని ఈ రెండు గ్రూ పులు కలిసి పనిచేస్తే ఆ చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేవారని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు రెబల్స్ దెబ్బ కూడా బలంగానే తాకింది.

గెలుపు ఓటములకు అర శాతమే తేడా

హర్యానా ఎన్నికలు మొదటి నుంచి నువ్వా నేనా అన్నట్లుగా సాగాయి. బీజేపీ ఒంటిరిగానే పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ సీపీఎంతో పొత్తు పెట్టుకొన్నది. ఎన్నికల ప్రచారం కూడా ఈ రెండు జా తీయ పార్టీల మధ్య పోరాటంగానే సాగిం ది. రాష్ట్రంలో రైతులు, క్రీడాకారుల వ్యతిరేకంతోపాటు పదేండ్లుగా అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత కూడా భారీగా పెరిగిందని, అందువల్ల బీజేపీ పది సీట్లు గెలిస్తే గొప్పేనని కొన్ని ఎగ్జిట్‌పోల్స్ సంస్థలు అంచనా వేశాయి.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 55 సీట్లు గెలుస్తుందని ప్రకటించాయి. అ అంచనాలన్నింటినీ ఎన్నికల ఫలితాలు తారుమారు చేశాయి. గత ఐదేండ్లు జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) వంటి చిన్న పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని నడిపిన బీజేపీకి ఈసారి ఓటర్లు సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టారు. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా, బీజేపీ 48 సీట్లు గెల చుకొన్నది.

2019 ఎన్నికల్లో బీజేపీకి 40 సీట్లు వచ్చాయి. ఇక అధికారం తనదేనని ఆశపడ్డ కాంగ్రెస్ మాత్రం 37 సీట్లతో సరిపెట్టుకొన్నది. విచిత్రం ఏమిటంటే ఈసారి బీజేపీ 39.95 శాతం ఓట్లు సాధించి 49 ఎమ్మెల్యేలను గెలచుకోగా, కాంగ్రెస్ 39.09 శాతం ఓట్లు సాధించినా 37 సీట్ల వద్దనే ఆగిపోయింది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా ఒకశాతం లోపే ఉండటం గమనార్హం. 

ఆప్‌కు షరాఘాతం

ఢిల్లీ, పంజాబ్ తర్వాత హర్యానాలోకి విస్తరించాలని కలలుగన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఆ రాష్ట్ర ఓటర్లు కనీసం పట్టించుకోలేదు. పార్టీ అధినేత కేజ్రీవాల్ సహా అగ్రనాయకత్వం మొత్తం జైల్లోనే ఉండటంతో రాష్ట్రంలో పార్టీ క్యాడర్ చెల్లాచదరైంది. ప్రచారం చివరిదశలో కేజ్రీవాల్ బెయిల్‌పై వచ్చి ప్రచారం చేసినా అప్పటికే చేయిదాటిపోయింది. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ ఖాతా కూడా తెరువలేకపోయింది. 

సంపన్న విజయం

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన భారత దేశపు అత్యంత సంపన్న మహళ సావిత్రి జిందాల్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కమల్ గుప్తాపై 18,941 ఓట్ల తేడాతో సావిత్రి జిందాల్ గెలుపొందారు. కాగా ఆమె హిసార్‌లో గెలుపొందడం ఇది మూడవసారి.

2005లో తన భర్త ఓపీ జిందాల్ మరణం తర్వాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన సాఇత్రి జిందాల్ .. 2005, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. 74 ఏళ్ల సావిత్ర జిందాల్ తాజా అసెంబ్లీ ఎన్నికల అనంతరం ‘అభార్ హిసార్ పరివార్( హిసార్ కుటుంబానికి కృతజ్ఞతలు)’ అని ఎక్స్‌లో ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 

32 ఓట్ల తేడాతో విజయం

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఉచన కలాన్ ఫలితం అందరి దృ ష్టిని ఆకర్షించింది. ఇక్కడ బీజేపీ అ భ్యర్థిగా పోటీచేసిన దేవేందర్ చతర్.. కాంగ్రెస్ అభ్యర్థి బ్రిజేందర్ సింగ్‌పై కేవలం 32 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కౌంటింగ్ స మయంలో ప్రతీ రౌండ్లోను కాంగ్రెస్ అభ్యర్థి కంటే వెనుకంజలో ఉన్న దేవేందర్ చతర్ చివరి రౌండ్లలో అనూహ్యంగా ఆధిక్యంలోకి వచ్చా రు.

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానా ల్లో కెల్లా అత్యల్ప ఓట్ల తేడాతో గెలిచి రికార్డు సృష్టించారు దేవేందర్. కాగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థా నంలో, మాజీ డిప్యూటీ సీఎం, జేజే పీ నాయకుడు దుష్యంత్ చౌతాలా 5వ స్థానంలో నిలవగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పవన్ ఫౌజీ 8వ స్థానంలో నిలిచాడు.