calender_icon.png 4 January, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొడగొట్టిన హర్యానా

30-12-2024 01:19:46 AM

* తొలిసారి టైటిల్ నెగ్గిన స్టీలర్స్ 

* పని చేయని దేవాంక్ సునామీ

విజయక్రాంతి ఖేల్ విభాగం: ప్రొకబడ్డీ సీజన్ హర్యానా స్టీలర్స్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హర్యానా 32 తేడాతో పట్నా పైరేట్స్ మీద ఘన విజయం సాధించింది. అక్టోబర్ 18 నుంచి అభిమానులను అలరిస్తూ వస్తున్న ఈ లీగ్ ఆదివారంతో ముగిసింది. 11వ సీజన్ విజేతగా హర్యానా స్టీలర్స్ ఆవిర్భవించింది. హ ర్యానా స్టీలర్స్ పీకేఎల్ ట్రోఫీని గెలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తొలి నుంచి నువ్వా అన్నట్లు తలపడినా చివరికి హర్యానానే విజయం వరించింది. హర్యానా గెలుపులో రెయిడర్ శివం (9), ఆల్‌రౌండర్ షాదులు (7) కీలకపాత్ర పోషించారు. 

పని చేయని దేవాంక్ మంత్రం

సీజన్ ఆరంభం నుంచి పట్నా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్న రెయిడర్ దేవాంక్ (5) ఫైనల్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. 11 రెయిడ్లు చేసిన దేవాంక్ కేవలం ఐదు రెయిడ్ పాయింట్లు మాత్రమే సాధించాడు. మరో స్టార్ రెయిడర్ అయాన్ (3)కు కూడా ఈ ఫైనల్ పెద్దగా కలిసిరాలేదు.

11 రెయిడ్లు చేసిన అయాన్ కేవలం మూడు రెయిడ్ పాయింట్లు మాత్రమే సాధించాడు.ఏకంగా ఆరుసార్లు అయాన్‌ను ఔట్ చేయడం గమనార్హం. చాలా సేపటి వరకు హోరాహోరీగా తలపడ్డా చివరికి పట్నా పైరేట్స్ తేలిపోయింది. దీంతో హర్యానాను విజయం వరించింది. హర్యానా స్టీలర్స్ పీకేఎల్ టైటిల్ నెగ్గడం ఇదే తొలిసారి. 

కనిపించిన మన్‌ప్రీత్ మార్క్

హర్యానా స్టీలర్స్ 2017లో టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చినా కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేకపోయింది. కానీ ఈ సారి మాత్రం ఫైరీ కోచ్ మన్‌ప్రీత్ వల్ల హర్యానా టైటిల్ కల నెరవేరింది. పీకేఎల్‌లో పట్నా పైరేట్స్ తరఫున ఆడిన మన్‌ప్రీత్ తర్వాత గుజరాత్‌కు కోచ్‌గా సేవలందించాడు. 

2022లో హర్యానాకు కోచ్‌గా వచ్చిన మన్‌ప్రీత్ ఆ జట్టును 2023లో ఫైనల్‌కు తీసుకెళ్లాడు.ఇప్పటి వరకు  మన్‌ప్రీత్ సింగ్ కోచ్‌గా 7 సీజన్లకు పని చేయగా.. అతడు కోచింగ్ ఇచ్చిన జట్లు ఐదు సీజన్లలో ప్లే ఆఫ్స్, 4 సీజన్లలో ఫైనల్ చేరాయి.