కామారెడ్డి, (నిజామాబాద్), (విజయ క్రాంతి): హర్యానా గవర్నర్ బండార్ దత్తాత్రేయకు ఆదివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో బిజెపి నాయకుడు గద్దె భూమన్న ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా నిజాంబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. బండారు దత్తాత్రేయ బోధన్ మండలం కందకుర్తి గ్రామంలోని డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డే వార్ స్ఫూర్తి కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్తున్న సందర్భంగా డిచ్పల్లిలో ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లోక భూపతిరెడ్డి దినేష్ తదితరులు పాల్గొన్నారు.