calender_icon.png 9 October, 2024 | 3:58 AM

నేడు హర్యానా, కశ్మీర్ ఫలితాలు

08-10-2024 01:35:11 AM

చంఢీగఢ్/శ్రీనగర్, అక్టోబర్ 7: హర్యా నా, జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం మొదలుకానుంది. రెండు రాష్ట్రాల్లోనూ మంగళవారం ఉద యం 8 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సిబ్బంది తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.

కేంద్రాల వద్ద మూడ ంచెల భద్రతావ్యవస్థ అమలులో ఉంటుంది. హర్యానాలో రెండుసార్లు అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ మూడోసారి ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అన్న సందిగ్ధంలో ఉన్నది. మరోవైపు కాంగ్రెస్ ఈసారి అధికార పగ్గాలు చేపడతామనే ధీమాలో ఉన్నది. ఇక్కడ ఎగ్జి ట్ పోల్స్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండ డం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఇక్కడ ఒకేదశలో ఓటింగ్ జరిగింది.

పోలింగ్ 67.90శాతం నమోదైంది. ఇక్కడ ఏ పార్టీ అధికార పగ్గాలు చేపట్టాలన్నా కనీసం 46 స్థానాలు చేజిక్కించుకోవాల్సిందే. మరోవైపు కశ్మీర్‌లో 2018లో పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. ఇక్కడ మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మూడు దశల్లో పోలింగ్ ప్రక్రియ సాగింది. పోలింగ్ 63.45 శాతం నమోదైంది.

ఫలితాలు బీజేపీ కంటే ఎన్సీపీ కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఏదైనా ఒక పార్టీ లేదా కూటమికి కనీసం 46 సీట్లు కావాలి. ఇక్కడ హంగ్ వస్తుందా? లేదంటే ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పిన విధంగా  ఎన్సీపీ కాంగ్రెస్ కూటమిదే పైచేయి అవుతుందా.. అనేది వేచి చూడాల్సిందే.

ముఫ్తీ మద్దతిస్తే.. 

జమ్మూకశ్మీర్‌లో హంగ్‌కు చోటిస్తాయని ఎగ్జిట్‌పోల్స్ వెలువడిన నేపథ్యంలో సోమ వారం ఎన్సీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకపోయినా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తమకు మద్దతు ఇస్తానంటే తీసుకుంటామని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రాన్ని కాపాడేందు కు తాము కలిసి పనిచేసేందుకు సిద్ధమని తేల్చి చెప్పారు. కానీ, ఇప్పటివరకు తాము ముఫ్తీతో ఈ విషయంపై చర్చించలేదని స్పష్టం చేశారు.