calender_icon.png 8 October, 2024 | 12:09 PM

ఉత్కంఠ రేపుతున్న హరియాణా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు

08-10-2024 09:31:29 AM

హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో దూసుకెళ్తుంది. హరియాణాలోని 90 నియోజకవర్గాల్లో 1031 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. జమ్మూకశ్మీర్ లో 90 నియోజకవర్గాల్లో 837 మంది అభ్యార్థులు ఎన్నికల బరిలో నిలిచారు.దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందస్తు వేడుకలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. హరియాణాలో అక్టోబర్ 5వ తేదిన ఒకే విడతలో 90 స్థానాలకు పోలింగ్ జరిగింది.

హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 46 సిట్లలో గెలుపొందాలి. హరియాణాలో కాంగ్రెస్ పార్టీ 31, బీజేపీ పార్టీ 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసున్నారు. జమ్మూకశ్మీర్ లోని 90 స్థానాలకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోగా.. బీజేపీ, పీడీపీలు ఒంటరిగా పోటీచేశాయి. జమ్మూకశ్మీర్ లో 32 చోట్ల నేషనల్ కాన్ఫరెన్స్,   బీజేపీ 23, పీడీపీ 4, కాంగ్రెస్ 8, ఒమర్ అబ్దుల్లా పోటీచేసిన రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.