calender_icon.png 15 January, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్వీందర్‌కు పసిడి

05-09-2024 12:00:00 AM

పారా ఆర్చరీలో రెండో పతకం

పారిస్: ప్రతిష్ఠాత్మక పారాలింపిక్స్ ఆర్చరీ విభాగంలో భారత్ ఖాతాలో రెండో పతకం వచ్చి చేరింది. పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ విభాగంలో భారత ఆర్చర్ హర్వీందర్ సింగ్ పసిడి పతకం కొల్లగొట్టాడు. బుధవారం జరిగిన ఫైనల్లో హర్వీందర్ సింగ్ 6 తేడాతో పోలండ్ పారా ఆర్చర్ సిజెక్ లుకాజ్‌ను చిత్తుగా ఓడించి స్వర్ణం చేజెక్కించుకున్నాడు. అంతకముందు సెమీస్‌లో  హర్వీందర్ 7 తేడాతో ఇరాన్ ఆర్చర్ మొహమ్మద్ రెజాపై విజయం సాధించాడు.

ఆర్చరీలో ఇది రెండో పతకం కాగా.. ఇంతకముందు మిక్స డ్ కాంపౌండ్ విభాగంలో శీతల్ జోడీ కాంస్యం గెలిచింది. కాగా టోక్యోలో కాంస్యం సాధించి పారాలింపిక్స్ ఆర్చరీ విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించిన హర్వీందర్ ఈసారి పసిడితో మెరవడం విశేషం. పంజాబ్‌లోని హర్యానా కైతాల్ గ్రామానికి చెందిన హర్వీందర్ పుట్టిన ఏడాదిన్నరకు ప్రాణాంతక డెంగ్యూ వ్యాధి సోకింది. స్థానిక డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతో హర్వీందర్ కాళ్లలో బలహీనత ఏర్పడి వైకల్యం బారిన పడ్డాడు. 2018 ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణం సాధించడం ద్వారా హర్వీందర్ వెలుగులోకి వచ్చాడు. ఆ వెంటనే టోక్యో పారాలింపిక్స్‌లో కాంస్యం తో సత్తా చాటాడు.