పారాలింపిక్స్ ముగింపు వేడుకలు
పారిస్: పారాలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత్ తరఫున పతాకధారులుగా హర్వీందర్ సింగ్, ప్రీతి పాల్ వ్యవహరించనున్నారు. ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ విభాగంలో హర్వీందర్ స్వర్ణం సాధించగా.. మహిళల 100మీ, 200 మీటర్ల ఈవెంట్‌లో ప్రీతి కాంస్యాలతో మెరిసింది. తద్వారా ఆర్చరీ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత పారా ఆర్చర్‌గా హర్వీందర్ సింగ్ నిలిచాడు.
ఇక అథ్లెటిక్స్ విభాగంలో ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా ప్రీతి రికార్డులకెక్కింది. ప్రారంభవేడుకల్లో సుమిత్ అంటిల్, భాగ్యశ్రీ జాదవ్‌లు భారత పతాకధారులుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పారాలింపిక్స్‌లో భారత్ 26 పతకాలు సాధించింది.