23-04-2025 12:30:57 AM
ఖమ్మం, ఏప్రిల్ 22 : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలలో తమ విద్యార్థినీ విద్యార్థులు అగ్రశ్రేణి ఫలితాలు సాధించినట్టు ’హార్వెస్ట్’ జూనియర్ కళాశాల యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.2024-25 విద్యా సంవత్సరానికి గానూ తమ కళాశాల నుండి ప్రథమ సంవత్సర విద్యార్థులు 133 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థినీ విద్యార్థులు 102 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో తమవిద్యార్థి ఎం.పి.సి గ్రూపు నుండి ఎ. శ్రీకళ 467, ఎ.యామిని 466, జి.ప్రణతి 466, ఎం.సిరి శాన్వి 466, కె.రుచిత 466,జి.కౌసల్య 465, జి.పూజిత 465, జి. నమిత్ 464, ఓ. అభిరామ చరణ్ 464 మార్కులు సాధించినట్లు వివరించారు.
మొదటి సంవత్సరం ఎం.పి.సి గ్రూపులో గణితం 1ఎ లో 19 మంది, గణితం 1బిలో - 38 మంది, భౌతిక శాస్త్రంలో 40 మంది, రసాయన శాస్త్రంలో 16 మంది వందశాతం మార్కులు సాధించినట్లు వారు తెలిపారు. అదేవిధంగా తమ ద్వితీయ సంవత్సర విదార్థులు ఎం.పి.సి గ్రూపు నుండి సి.హెచ్. నిఖిత్, సి.హెచ్. నివేదిత,పి.హరిణి 990 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారన్నారు. పి. వెంకటకౌషిక్ 985, సి.హెచ్. జీవన తేజశ్రీ 984, కె. భువన్ 984, ఎన్. జాహ్నవి రెడ్డి 981, ఎ.స్రవిష్ట చౌదరి 980 మార్కులతో ఎం.పి.సి గ్రూపు నుండి అత్యున్నత మార్కులు సాధించినట్లు వారు వివరించారు.
ద్వితీయ సంవత్సరంలో తమ విద్యార్థినీ, విద్యార్థులు గణితం 2ఎ లో-30 మంది, గణితం 2బి లో- 10 మంది, వందశాతం మార్కులు, భౌతిక శాస్త్రంలో 25 మంది వందశాతం మార్కులు, రసాయన శాస్త్రంలో 12 మంది వందశాతం మార్కులు సాధించారన్నారు. మంగళవారం కళాశాల ఆవరణలో ’హార్వెస్ట్’ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల కరస్పాడెంట్ పి. రవిమారుత్ , ప్రిన్సిపల్ ఆర్. పార్వతీరెడ్డి విద్యార్థులను అభినందించి, భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని అభిలషించారు.