22-04-2025 11:55:22 PM
నిధులు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం కోర్టులో దావా వేసింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఇప్పటికే 2.2 బిలియన్ డాలర్ల నిధులన కోత విధించిన ట్రంప్ యంత్రాంగం తాజాగా మరో బిలియన్ డాలర్ల నిధుల కోతకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో హార్వర్డ్ పిటిషన్ దాఖలు చేసింది. హార్వర్డ్‌కు నిధులు నిలిపివేయడం ద్వారా విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తున్నారని కేసులో పేర్కొంది.
విశ్వవిద్యాలయానికి నిలిపివేసిన 2.2 బిలియన్ డాలర్లకు పైగా గ్రాంట్ నిధులను సమాఖ్య ప్రభుత్వం నిలిపివేయాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని కోరింది. గతవారం హార్వర్డ్ తన చట్టవిరుద్ధమైన డిమాండ్లను పాటించడానికి నిరాకరించడంతో సమాఖ్య ప్రభుత్వం విశ్వవిద్యాలయం ఇటువంటి చర్యలు తీసుకుంటోందని హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వారికి ఉన్న అధికారానికి మించినవి అయినందువల్ల తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు.