ఆసీస్‌తో అండర్-19 అనధికారిక టెస్టు
చెన్నై: చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న అనధికారిక యూత్ టెస్టులో ఇండియా బ్యాటర్లు కదం తొక్కారు. వికెట్ కీపర్ హర్‌వన్ష్ సింగ్ పంగాలియా (117) సెంచరీతో చెలరేగాడు. పంగాలియా కేవలం 143 బంతుల్లోనే సెంచరీ చేయడం గమనార్హం. 11వ నెంబర్ బ్యాటర్‌తో కలిసి సెంచరీ చేయడం విశేషం. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 492 పరుగులకు ఆలౌట్ అయింది.
నిత్య పాండ్య (94) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో ఒలీ పోప్, హ్యరీ, క్రిస్టియన్, రనాల్డో తలా రెండు వికెట్లు తీసుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్లు నష్టపోయి 142 పరుగులు చేసింది. ఆసీస్ ఇంకా 350 పరుగులు వెనుకబడి ఉంది. రెండు టెస్టుల సిరీస్‌లో భారత అండర్-19 జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. ఆఖరి వికెట్‌కు భారత జట్టు కేవలం 107 బంతుల్లోనే 90 పరుగులు జోడించింది.