కజిరంగా నేషనల్ పార్కులో ప్రత్యక్షం
గౌహతి, జూలై 11 : ‘సలాజర్ పిట్ వైపర్’ అని పిలవబడే ఆకు పచ్చని పాము అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ పాముపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘చూశారా పిల్లలూ..! ఇది హ్యారీ పోటర్ రియల్ లైఫ్ స్నేక్. ఆకుపచ్చ రంగులో సూపర్ కూల్‌గా ఉంది కదూ..! తలపై ఎరుపు, నారింజ రంగుల్లో ఆకట్టుకుంటోంది. ప్రకృతి చేసిన అద్భుతం ఇది” అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.