డల్లస్: పాకిస్థాన్ బౌలర్ హారిస్ రవూఫ్ బాల్ టాంపరింగ్ పాల్పడినట్లు అమెరికా సీనియర్ క్రికెటర్ రస్టీ థెరాన్ ఆరోపించాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం అమెరికాతో మ్యాచ్ సందర్భంగా రవూఫ్ ఈ చర్యకు పాల్పడ్డాడంటూ థెరాన్ ఐసీసీకి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఫిర్యాదు చేశాడు. ‘మ్యాచ్ మధ్యలో కొత్తగా తీసుకున్న బంతిని రవూఫ్ బొటనవేలితో నొక్కుతూ కనిపించాడు. కేవలం 2 ఓవర్ల ముందే మార్చిన బంతితో రివర్స్ స్వింగ్ రాబట్టడం సాధ్యమవుతుందా? కానీ రవూఫ్ మాత్రం బంతిని తన బొటనవేలితో బలంగా రుద్దుతూ పరిగెత్తడాన్ని మీరే చూడొచ్చు’ అని ఐసీసీని ట్యాగ్ చేస్తూ థెరాన్ పోస్టు పెట్టాడు.