calender_icon.png 20 September, 2024 | 6:27 AM

ట్రంప్‌ను దాటేసిన హారిస్

07-09-2024 01:53:55 AM

న్యూయార్క్, సెప్టెంబర్ 6: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. తన పంథాలో దూసుకెళ్తున్న యూఎస్ ఉపాధ్యక్షురాలు కమ లా హారిస్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఎనికల ఖర్చు కోసం ఇరు పార్టీలు దాతల నుంచి విరాళా లు సేకరిస్తుండగా.. ఆగస్టు నెలలో కమలాహారిస్ 30 లక్షల మంది దాతల నుంచి 36.10 కోట్ల డాలర్ల విరాళాలు వచ్చాయి.

ఈ నెలలో న్యూయా ర్క్, అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు హారిస్ బృందం ఏర్పాట్లు చేస్తోం ది. ట్రంప్‌కు మాత్రం ఆగస్టులో కేవలం 13 కోట్ల డాలర్లు మాత్రమే వచ్చాయి. ట్రంప్ కంటే హారిస్ 23 కోట్ల డాలర్లను ప్రజల నుంచి అధికంగా సేకరించగలిగారు.