calender_icon.png 6 November, 2024 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలక్షన్ నైట్ ప్రసంగాన్ని రద్దు చేసుకున్న హారిస్

06-11-2024 12:45:17 PM

వాషింగ్టన్: అమెరికాలో ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. ఫలితాలు వెలువడుతున్న కొద్ది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ట్రంప్ విజయానికి చేరువవుతున్న నేపథ్యంలో కమలా హరీస్ ఎలక్షన్ నైట్ ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు. ఇవాళ ఆమె ప్రసంగించరని, రేపు మాట్లాడతారని ప్రచార బృంద సభ్యుడు సెడ్రిక్ రిచ్మండ్ పేర్కోన్నారు.

అమెరిక అధ్యక్షఎన్నికల్లో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ (270) కు చేరువలో ఉన్నారు. ప్రస్తుతం (247) చేరువలో కొనసాగుతున్నారు. అటు మరో 6 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో కమలాహరిస్ కు 214 వచ్చాయి. ఆమె కేవలం 2 రాష్ట్రాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కీలక స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ దే ఆధిపత్యం, 270 ఓట్లు సాధించిన అభ్యర్ధి అమెరికా కొత్త అధ్యక్షుడిగా నియామకం కానున్నారు.