calender_icon.png 1 April, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శీతల విష పానీయాలు

28-03-2025 12:00:00 AM

వేసవి వచ్చిందంటే అన్ని అనర్థాలను, దరిద్రాలను  ఆహ్వానించ డం చాలామందికి అలవాటుగా మారింది. కూల్‌డ్రింక్ షాపులవైపు పరుగెత్తేవారు ఎందరో. దాదాపు ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్‌లో కూల్‌డ్రింక్ బాటిల్స్ ఉంటాయి. ప్రతి వారం క్రమం తప్పకుండా షాపింగ్ మాల్స్‌కు వెళ్లి సంచుల కొద్దీ శీతల పానీయాలు కొని తెచ్చుకుంటుంటారు. వాస్త వానికి కూల్‌డ్రింక్స్ చల్లదనాన్ని ఇవ్వక పోగా, మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయ ని అనేక పరిశోధనలు తేల్చాయి. మన శరీరంలో జరిగే మార్పులు గ్రహించకుండా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన అలవాట్లను మనిషి నేర్చుకుంటున్నాడు. 

ముఖ్యంగా ఈ పాశ్చాత్య ఫ్యాషన్ నాగరికతలో భాగంగా జనం కూల్‌డ్రింకులకు బాగా అలవాటు పడ్డారు. వీటిలో ఎక్కువ శాతం పురుగుల మందుల అవశేషాలు పుష్కలంగా ఉంటున్నట్లు ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ (ఇండియా) దశాబ్దం క్రితమే తేల్చి చెప్పింది. మానవ శరీరాలను ప్రమాదకరంగా మార్చే పదార్థాలు ఈ పానీయాలలో తయారీదారులు కలుపుతున్నట్టు ఆరోపణలు వున్నాయి. వాటిలో కలుస్తున్న హానికర పదార్థాలలో కార్బోనేటెడ్ వాటర్, కార్న్ సిరప్, పంచదార, ఎస్పిరటం, కారమెల్, ఫాస్ఫరిక్ ఆమ్లం, కెఫిన్, సిట్రిక్ ఆమ్లం, పొటాషియం బెంజైట్, పొటాషియం సిట్రేట్ వంటివి ఉంటున్నట్లు పరిశోధనలు వెల్లడించాయి. కూల్‌డ్రింక్‌లలో ఆర్గానో క్లోరిన్, ఆర్గానో ఫాస్ఫరస్, పురుగుల మందులైన లిండేన్, డీడీటీ, మలాథియాన్ ఉంటున్నట్లు పలు పరిశోధనలు తేల్చినా ప్రభుత్వాలు వాటిని నిషేధించడం లేదు. 

ఏటా రూ.7 వేల కోట్ల వ్యాపారం

ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూల్‌డ్రింక్ కంపెనీలు ఏటా 7,000 కోట్లు దోచుకుంటున్నట్టు అంచనా. ప్రజల డబ్బు తో హీరోలుగా, క్రీడాకారులుగా, అవార్డు గ్రహీతలుగా, పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారు కోట్లలో డబ్బు తీసుకుని ప్రజారోగ్యాన్ని నిర్వీర్యం చేసే వాణిజ్య ప్రకటనలు ఇస్తున్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు బనాయించాల్సిన ప్రభుత్వం వారిని అవార్డులతో సత్కరించడం సిగ్గుచేటు. కూల్‌డ్రింకుల పీహెచ్ (పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్) శాతం టాయిలెట్ క్లినర్స్ యాసిడ్‌తో సమానంగా ఉంటుందంటే అవి ఎంత ప్రమాదకరమో తెలుస్తున్నది.

దీంతో స్థూలకాయం, ఊపిరితిత్తులు, బీపీ, షుగర్, ఎముకలు మెత్తబడి పోవడం, కీళ్ల నొప్పులు అధికంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. జీర్ణ వ్యవస్థను ధ్వంసం చేయడమేకాక మూత్రపిండ వైఫల్యానికీ దారి తీస్తుంది. గర్భిణీ స్త్రీలు కనుక కూల్‌డ్రింకులు సేవిస్తే పుట్టబోయే పిల్లలు, -పిండంపై తీవ్ర దుష్ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ, లివర్, క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. తరచుగా అధిక మొత్తంలో చక్కెరతో కూడిన శీతల పానీయాలు మన దైనందిన జీవితంలో పాతుకు పోయాయి. 

అనారోగ్యం ఇంతా అంతా కాదు

వాస్తవానికి మద్యపానం, సిగరెట్, గుట్కా  వంటి పదార్థాల మాదిరిగా కూల్ డ్రింక్స్ వ్యసనానికి దారితీస్తాయి. కొన్ని శీతల పానీయాలు చక్కెర స్థాయిలను కలిగి ఉంటా యి. ఇది రోజువారీ సిఫార్సు చేసిన స్థాయిలను మించిపోయింది. అధిక చక్కెర ఊబ కాయం, మధుమేహం, దంత సమస్యలు సహా వివిధ అనారోగ్యాలకు దోహదం చేస్తుంది.  అంతేకాక, శీతల పానీయాల ప్రతికూల ప్రభావం చక్కెర కంటెంట్‌కు మించి ఉంటుంది. వీటిలో  టాయిలెట్ క్లీనర్లతో సమానంగా ఆమ్ల లక్షణాలు  ఉంటాయి.

దంతాలపైన, జీర్ణ వ్యవస్థపైనా అవి  తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఆమ్ల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పంటి ఎనామిల్ చెదిరి పోతుంది. జీర్ణాశయాంతర అసౌకర్యానికి పరిస్థితి దారితీస్తుంది. ఈ పానీయాల సేవనం ఇంకా అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంది. వీటిలోని అధిక చక్కెర కంటెంట్ ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ‘టైప్ మధుమేహం వచ్చే ప్రమాదాన్నీ పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు, హృదయనాళ ఆరోగ్యంపై వాటి ప్రభావం కారణంగా రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ వ్యాధి  స్ట్రోక్ సహా గుండెజబ్బుల ప్రమాదాన్నీ అధికం చేస్తుంది.

ఆమ్లత్వం వల్ల కృత్రిమ సంకలనాలు కడుపు లైనింగ్‌ను చికాకు పరుస్తాయి. ఇది యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం తదితర సమస్యలకు దారితీస్తుంది. ఈ పానీయాలలో వాడే కృత్రిమ స్వీట్నర్స్ వినియోగం ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. శీతల పానీయాల రెగ్యులర్ వినియోగం, ముఖ్యంగా ఫ్రక్టోజ్ అధికంగా ఉండేవి, కాలక్రమేణా కొవ్వు కాలేయ వ్యాధి, కాలేయం దెబ్బ తినడానికి దోహదం చేస్తాయి. ఈ పానీయాలలో అధిక స్థాయి చక్కెర, కెఫిన్ పురుషులు, స్త్రీలలో పునరుత్పత్తి ఆరోగ్యం, సంతానోత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. వీటిలోని ‘ఫాస్పోరిక్ యాసిడ్’ క్యాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఎముక సాంద్రత నష్టానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలలో బోలు ఎముకల వ్యాధి, పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.  

నిషేధించే దాకా ఉద్యమిద్దాం

ప్రజలు వేసవిలో మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలు, రాగి జావ, తాటి ముంజలు, క ర్బుజా, కళింగర, కీర దోస పిల్లలకు అలవాటు చేస్తే మంచిది. మంచి ఆరోగ్య అల వాట్లు ఇంటినుంచే ప్రారంభం కావాలి. పెళ్లిళ్లు, శుభకార్యాలలో ఆరోగ్యానికి హాని కలిగించే అన్ని రకాల కూల్ డ్రింక్స్‌నూ నిలుపుదల చేయాలి. ప్రభుత్వం దీనిని నిషేధించే వరకు ప్రజలు పౌర సంఘాలు ఉద్యమించాలి. స్వలాభం కోసం వాణిజ్య ప్రకటనలు ఇచ్చే హీరోలు, హీరోయిన్లు, క్రీడాకారులపై అధికారులు కేసులు  పెట్టా లి.

మనం చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేస్తే శవం పూర్తిగా కాలిపోతుంది. ఎముకలు పూర్తిగా నశిస్తాయి. కానీ, నోటిలోని పళ్లు మాత్రం కాలిపోవు. శవాన్ని కాల్చడానికి బదులుగా భూమిలో పాతి పెడితే శరీరం మొత్తం మట్టిలో కలుస్తుంది. 20 సంవత్సరాల తర్వాత ఆ మట్టి భాగాన్ని తవ్వి తీస్తే పళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. అంత గట్టిగా మన పళ్లు తయారై ఉన్నాయి. ఏ పళ్లను అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్లను మట్టి తనలో కరిగించు కోలేక పోయిందో, అవే నోటి దంతాలను ఇరవై రోజులపాటు ఏదైనా ఒక కూల్‌డ్రింక్‌లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ దంతా లు రంగు మారి నొక్కితే పిండిగా అవుతున్నాయి.

ఒక కూల్‌డ్రింకులో ఒక దంతం వేసి 8వ రోజు చూసేసరికి ఆ పన్ను పూర్తి గా కరిగిపోయి మాయమైంది. మనం పు ట్టిన దగ్గర నుంచి చనిపోయేలోపు 50 టన్నుల ఆహారాన్ని అయినా ఈ దంతాలతోనే నములుతాం. అన్ని టన్నుల ఆహారా న్ని నమిలినా అరగని దంతాలను ఒక కూల్‌డ్రింక్ నెల తిరగకుండా కరిగించేస్తుందంటే అవి ఆహార పానీయాలా? లేక కాల కూట విష పదార్థాలా? కాకపోతే ఎక్కువ నీటి శాతం ఉండబట్టి మెల్లగా చంపే విషం లా పనిచేస్తాయి. అలాంటి గట్టి పళ్లనే నాశ నం చేసే డ్రింక్స్‌కు మన లోపలి పేగులు, నరాలు, కణాలు ఒక లెక్కా ఏమిటి? ఇప్పటికైనా ప్రభుత్వాలు సత్వరమే స్పందించి శీతల పానీయాలు అన్నింటినీ నిషేధించాలి. అసలు, వీటి తయారీనే లేకుండా చేయాలి.

 డా. యం.అఖిలమిత్ర