- జపాన్‌పై భారత్ ఘన విజయం
- ఆసియా చాంపియన్స్ ట్రోఫీ
చైనా: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ సేన జోరు ప్రదర్శిస్తోంది. తొలి మ్యాచ్‌లో చైనాను చిత్తు చేసిన టీమిండియా సోమవారం జపాన్ పని పట్టి పా యింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్ తరఫున సుఖ్‌జీత్ సింగ్ (2వ నిమిషంలో, 60వ ని.లో), అభిషేక్ (3వ ని.లో), సంజయ్ (17వ ని.లో), ఉత్తమ్ సింగ్ (54వ ని.లో) గోల్స్ సాధించగా.. జపాన్ తరఫున కజుమసా (ఆట 41వ నిమిషం) ఏకైక గోల్ అందించాడు. కాగా మ్యాచ్‌లో ఆట ఆరంభం నుంచే ఇండియా ఆధిపత్యం చెలాయించింది. ఆట ఆరంభం అయిన తొలి మూడు నిమిషాల్లోనే ఇండి యా 2 లీడ్‌లోకి వెళ్లడం గమనార్హం. హాఫ్ టైమ్ ముగిసే సరికి భారత్ 3 ఆధిక్యంలో నిలిచింది. బుధవారం మలేషియా తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.