calender_icon.png 30 October, 2024 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌లో హర్మన్ సేన

02-08-2024 12:07:50 AM

నేడు ఆసీస్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్

పారిస్: భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం బెల్జియం చేతిలో పరాజయం చవిచూసినప్పటికీ ఇప్పటికే రెండు విజయాలు, ఒక డ్రాతో మూడో స్థానంలో నిలిచిన టీమిండియా క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇక పూల్‌| భాగంగా  భారత్ 1 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ బెల్జి యం చేతిలో ఓటమి పాలైంది. భారత్ తరఫున అభిషేక్ (ఆట 18వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించగా.. బెల్జియం తరఫున స్టాక్ బ్రోక్స్ (33వ ని.లో), జాన్ డోహ్‌మెన్ (44వ ని.లో) గోల్స్ సాధించారు.

మ్యాచ్‌లో ఒకానొక దశలో డ్రా దిశగా సాగినప్పటికి బెల్జియం ముందు ఆటలు సాగలేదు. మనోళ్లకు రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చిప్పటికీ గోల్‌గా మలచడంలో విఫలమయ్యారు. అయితే మన గోల్‌కీపర్ శ్రీజేష్ బెల్జియం అటాకింగ్‌ను సమర్థవంతంగా అడ్డుకోవడం కాస్త చెప్పుకోదగ్గ అంశం. ఇప్పటికే బెల్జియంతో పాటు క్వార్టర్స్‌కు చేరిన భారత్.. నేడు ఆఖరి మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. ఆసీస్‌పై గెలవడం అంత ఈజీ కానప్పటికీ ఈ గెలుపు మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిచే అవకాశముం టుంది. గ్రూప్‌లో నెదర్లాండ్స్, ఐర్లాండ్‌పై విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్ సేన అర్జెంటీనాతో మ్యాచ్‌ను మాత్రం డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.