calender_icon.png 19 March, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హార్లే డేవిడ్సన్ బైకర్స్ ర్యాలీ

17-03-2025 12:29:58 AM

మూత్రపిండ వ్యాధిపై అవగాహన కోసం మెడికవర్ హాస్పిటల్స్ నిర్వహణ

హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): వరల్‌డ కిడ్నీ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, హార్లే డేవిడ్సన్ బైకర్స్ కలిసి కిడ్నీ వ్యాధులపై అవగాహన పెంచడం కోసం ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెడికవర్ హాస్పిటల్స్, హార్లే ఓనర్స్ గ్రూప్, బంజారా చాప్టర్ సభ్యుల భాగస్వామ్యంతో కిడ్నీ వ్యాధులపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం అభినందింనీయమన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ నెఫ్రాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ కమల్ కిరణ్ మాట్లాడుతూ..

అనేక మందికి ముందస్తు లక్షణాలు లేకపోవడం, మధుమేహం లేకపోయినా మూత్రపిండాలు పని చేయడం ఆగిపోవడం సాధారణంగా కనిపిస్తోందన్నారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు కూడా సీకేడీ పెరుగుదలకు కారణమవుతున్నాయన్నారు.

ప్రపంచ మూత్ర పిండ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్, హాస్పిటల్స్ చీఫ్ అఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ దెగ్లూర్కర్ మాట్లాడుతూ.. వరల్‌డ కిడ్నీ డే అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజారోగ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. కాగా ఈ ర్యాలీ మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి నియోపోలీస్ మూవీ టవర్స్  మీదుగా క్రిమ కేఫ్ మోకిల, అక్కడ నుంచి తిరిగి మెడికవర్ హాస్పిటల్స్ నిర్వహించారు.