calender_icon.png 29 December, 2024 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్లీన్ డియోల్ ధమాకా

25-12-2024 12:37:37 AM

వడోదర: స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత మహిళల జట్టు 2 సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 115 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (103 బంతుల్లో 115; 16 ఫోర్లు) సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు ప్రతికా రావల్ (76), మంధాన (53), రోడ్రిగ్స్ (52) అర్థశతకాలతో మెరిశారు. కాగా వన్డేల్లో హర్లీన్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (106) సెంచరీతో కదం తొక్కినప్పటికీ మిగతావారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 3, దీప్తి, టిటాస్ సాధు చెరో 2 వికెట్లు తీశారు.