calender_icon.png 23 February, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాణిజ్య పన్నుల శాఖ డైరెక్టర్‌గా హరిత

22-02-2025 01:22:58 AM

* సీటీవోగా కమర్షియల్ ట్యాక్స్‌లోనే కెరీర్ మొదలు

* ఇప్పుడే అదే శాఖకు అధిపతి

* సంస్కరణల్లో కీలక పాత్ర.. వ్యాట్ కమిటీలో సభ్యురాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): వాణిజ్య పన్నుల శాఖ డైరెక్టర్‌గా ఐఏఎస్ కే హరితను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్న ఆమె ఇప్పుడు కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్ విభాగాధిపతి అయ్యారు. హరితకు వాణిజ్య పన్నుల విభాగంతో సుదీర్ఘమైన అనుబంధం ఉంది.

1996లో ఆమె కెరీర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(సీటీవో)గా ఇదే డిపార్ట్‌మెంట్ మొదలైంది. ఆ తర్వాత అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్‌గా చాలా కాలం ఆమె ఇదే విభాగంలో సేవలు అందించారు. 2023, డిసెంబర్‌లో పంజాగుట్ట సర్కిల్‌లో కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్‌గా ఉన్న ఆమెను సర్కారు ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేసింది.

అదే డిపార్ట్‌మెంట్‌లో కెరీర్ మొదలు పెట్టి అదే శాఖలో విభాగాధిపతిగా నియామకం కావడం హరిత విషయంలోనే మొదటిసారి జరిగింది. పన్నుల విభాగంలో వచ్చిన కీలక సంస్కరణల్లో హరిత కీలకపాత్ర పోషించారు. 2005లో వ్యాట్ కమిటీలో హరిత సభ్యురాలిగా ఉన్నారు.