calender_icon.png 28 November, 2024 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘రంగనాయక్‌సాగర్’లో హరీశ్ అక్రమాలు

28-11-2024 03:13:03 AM

  1. ఇరిగేషన్‌కు బదలాయించిన 2.08 ఎకరాల నుంచి 9 గుంటలు తనపేరిట రిజిస్ట్రేషన్ 
  2. భూసేకరణ నుంచి మినహాయించిన 13.12 ఎకరాల భూమి కొనుగోలు 
  3. సొంత ప్రయోజనాల కోసమే ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ మార్పు
  4. హరీశ్‌రావుపై లాయర్లు జెల్లా రవీందర్, కుంచం అశోక్, పోతురాజు రమేశ్ ఆరోపణలు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): ‘బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రంగనాయక్‌గర్ ప్రాజెక్ట్ పేరుతో సిద్దిపేట జిల్లాలో జరిగిన భూసేకరణలో అక్రమాలు చోటుసుకున్నాయి. ఇరిగే షన్ శాఖ సేకరించిన భూమి నుంచి 9 గుం టల ల్యాండ్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు’ అని సిద్దిపేటకు చెందిన న్యాయవాదులు జెల్లా రవీందర్ యాదవ్, కుంచం అశోక్ యాదవ్, యూట్యూబర్ పోతురాజు రమేశ్ ఆరోపించారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్ట్ అలైన్‌మెంట్‌ను మార్చా రని.. తద్వారా తన భూమికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకునారని పేర్కొన్నారు. భూసేకరణ నుంచి మినహాయించిన 13.12 ఎకరాలను హరీశ్ కొనుగో లు చేశారని తెలిపారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో వారు ఈ మేరకు ఆరోపణలు చేశారు.

లాయర్ జెల్లా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచలో  సర్వేనంబర్ 402లో మొత్తం 5.04 ఎకరాల భూమి ఉంది. 2.08 ఎకరాలు ప్రాజెక్టు కోసం భూ యాజమానుల నుంచి ఇరిగేషన్ శాఖకు బదలాయించారు. ఇందులో ఏలేటి లతకు చెందిన 20 గుంటలు, బత్తు మాధవికి 1.19 ఎకరాలు, బత్తు దేశయ్య 8 గుంట లు, బీమారి లింగయ్యకు చెందిన గుంట భూమి ఉంది.

మిగతా 2.36 ఎకరాలు మిగు లు భూమిగా ఉంది. భూ సేకరణ భాగంగా ఇరిగేషన్ శాఖకు బదలాయించిన 2.08 ఎకరాల్లో 2017లో గుంట భూమి, 2023లో 8 గుంటల భూమిని ఉప్పెన విజయ పేరుపై బదలాయించారు. ఇరిగేషన్‌కు చెందిన ఈ మొత్తం 9 గుంటల భూమిని ఉప్పెన విజయ నుంచి 2024, జనవరి 27న హరీశ్‌రావు పేరుతో రిజిస్ట్రేషన్ అయింది’ అని పేర్కొన్నారు.

రంగనాయకసాగర్ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టే భూసేకరణకు మొదటి నోటిఫికేషన్‌లో ఉన్న మొత్తం 13.03 ఎకరాలను అలైన్‌మెంట్ మార్చడం ద్వారా భూ సేకరణ నుంచి మినహాయించారన్నారు. వివిధ పేర్లపై ఉన్న ఈ భూములను సయ్యద్ బిన్ అబ్దుల్లా పేరిట రిజిస్ట్రేషన్ చేసి, ఆ తర్వాత అతడి పేరు నుంచి హరీశ్‌రావు పేరుపై  బదిలీ చేసినట్లు చెప్పారు.

ఇలా భూసేకరణ సమయంలోనే మాజీమంత్రి హరీశ్‌రావు  మొత్తం 13.12 ఎకరాలను తన వశం చేసుకోవడానికి ప్రణాళికలు రచించారని వారు వెల్లడించారు. ఎలాంటి అను మానం రాకుండా ఉండేందుకు తన భూముల చుట్టూ పక్కల ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని సిద్దిపేట అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా)కు, సుడా రిసార్ట్, సుడా నర్సరీ, సుడా ట్రీ పార్క్‌కు కేటాయించారని తెలిపారు.

రంగనాయక్‌సాగర్ భూ సేకరణపేరుతో అక్రమంగా కూడబెట్టుకున్న హరీశ్‌రావు భూములను రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై బాధితులు న్యాయ పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు.