ఎక్స్‌లో మంత్రి, మాజీ మంత్రుల ట్వీట్ వార్
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ప్రస్తుత వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ట్వీట్ వార్ నడిచింది. పదేండ్లు ఆరోగ్యశ్రీని నీరుగార్చి, ఇప్పుడు అదే పథకం గురించి బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడటం చూస్తుంటే.. దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విమర్శించారు.
వారి హయాంలో హాస్పిటళ్లకు డబ్బులు చెల్లించలేదని, ప్యాకేజీల ధరలు రివైజ్ చేయలేదని, సుమారు రూ.730 కోట్లు బాకీ పెట్టి పోయారని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఒక్కో సమస్యను తాము పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు. పాత బకాయిలతో సహా రూ.1,130 కోట్లు ఏడాదిలో చెల్లించినట్లు వెల్లడించారు.
ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నామని, ప్యాకేజీల ధరలు రివైజ్ చేసి 22 శాతం మేర చార్జీలు పెంచినట్లు మంత్రి తెలిపారు. హాస్పిటళ్ల యాజమాన్యాలు లేవనెత్తిన ఇతర సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
పేదల పాలిట శాపం.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం : మాజీ మంత్రి హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పేదల ప్రజల పాలిట శాపంగా మారిందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆస్పత్రులకు బకాయిలు విడుదల చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపో యాయని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు.
ప్రజలు తీవ్రంగా ఇబ్బం దులు పడుతున్నా రాష్ట్రానికి పట్టింపు లేకుండా పోవడం దురదృష్టకరమన్నారు. నెట్‌వర్క్ హాస్పిటళ్ల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలన్నారు. పెండిం గ్ బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవ లు కొనసాగేలా చూడాలన్నారు.