calender_icon.png 13 February, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తిగత గోప్యతను హరీశ్ దెబ్బతీశారు

13-02-2025 12:27:45 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం వాదన

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత టీ హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ అభియోగాలతో నమోదైన కేసులో ఆధా రాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. ఏ దశలోనూ పిటిషనర్ హరీశ్‌రావుకు ఉపశమనం కల్పించొద్దని ప్రభుత్వం తరఫున లాయర్ సిద్ధార్థ లూద్రా వాదించారు. హరీశ్ కక్షసాధింపుతో కేసు నమోదు చేశామని చెప్పడం సరికాదన్నారు.

తన ఫోన్‌ను, తన కుటుంబ సభ్యుల ఫోన్లను హరీశ్‌రావు ట్యాపింగ్ చేయించారంటూ జీ చక్రధర్ గౌడ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును కొట్టి వేయాలంటూ హరీశ్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారించారు. లూద్రా వాదనల్లో,  30 మంది ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని చెప్పారు.

చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలకు తగిన ఆధారాలు ఉన్నందునే పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. పోలీసుల దర్యాప్తునకు పిటిషనర్ అవకాశమే ఇవ్వలేదన్నారు. డిసెంబర్ 1న ఫిర్యాదు నమోదు కాగా అదే నెల 5న కోర్టును ఆశ్రయించారని అన్నారు. హరీశ్‌రావు అప్పటి డీసీపీగా ఉన్న రాధాకిషన్‌రావు ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించారని, బెదిరించారని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారనే వాటిని ఆధారాలున్నాయని చెప్పారు.

ఫిర్యాదుదారుతోపాటు ఆయన భార్య, కుటుంబ సభ్యులు, సిబ్బందితో సహా దాదాపు 30 మంది ఫోన్లను ట్యాప్ చేయించారన్నారు. ఇలా చేయడం వ్యక్తిగత గోప్యత, రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని చెప్పారు. టెలిగ్రాఫ్ చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు.

ఆపిల్ కంపెనీ నుంచి గౌడ్ ఫోన్ ట్యాపింగ్ అవుతోందనే ఇమెయిల్ ద్వారా మెసేజ్ వచ్చిం దని, పిటిషనరే ఫోన్ ట్యాపింగ్ చేయించారనే అభియోగాలపై నమోదైన కేసులో దర్యాప్తును అడ్డుకోరాదని చెప్పారు. రాజకీయంగా ప్రత్యర్థులు ఆరోపణలు, ప్రత్యారోప ణలు చేసుకోవడం పరిపాటని, కానీ చక్రధర్ గౌడ్, ఆయన కుటుంబసభ్యుల ఫోన్ల ట్యా పింగ్ ప్రయత్నాలు వ్యక్తి గోప్యత హక్కుల ఉ ల్లంఘన కిందకు వస్తుందన్నారు.

కేసు విచారణ దశలోనే అడ్డుకోవద్దని కోరారు. వ్యక్తి గత గోప్యతను దెబ్బతీసే విధంగా ట్యాపింగ్ జరిగిందనే అభియోగాలపై దర్యా ప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.

రాజకీయ కుట్ర కేసు: హరీశ్ న్యాయవాది వాదన

ఈ కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని హరీశ్ రావు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హడావుడిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం చెల్లదన్నారు. ఏవిధమైన ప్రాథమిక విచారణ చేపట్టకుండానే కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు.

12 నెలలు ఆలస్యంగా ఫిర్యాదు నమోదు చేయడానికి చక్రధర్ వివరణ కూడా లేదన్నారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లకు, చక్రధర్ గౌడ్ అభియోగాలకు పొంతన లేదన్నారు. నమ్మక ద్రోహం (ఐపీసీ 409 సెక్షన్) ప్రాణ భయం (ఐపీసీ సెక్షన్ 386) సెక్షన్ల కింద గౌడ్ చేసిన ఫిర్యాదులోని అభియోగాలకు ఆధారాలు కూడా లేవని చెప్పారు. హరీశ్ రావుపై నమోదు చేయడం చెల్లదన్నారు.

చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై పోలీసులు ప్రాథమిక విచారణ చేయ కుండానే ఎఫ్‌ఐఆర్ నమోదు చెల్లదన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేక తప్పుడు ఫిర్యా దు చేశారని, ఏకపక్షంగా తప్పుడు కేసు బనాయించారని చెప్పారు. ఆపిల్ ఫోన్ల కంపెనీ నుంచి వినియోగదారులు అందరికీ తరుచుగా వచ్చే ఒక మెసేజ్ ఆధారంగా చేసుకు ని చక్రధర్ గౌడ్ తమ ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని చెప్పడం వెనుక అనుమానం మాత్ర మే ఉందని, ఆధారాలు ల్లేవని చెప్పారు.

గత ఏడాది ఆగస్టు 29న ఆపిల్ ఫోన్ల కంపెనీ నుంచి ‘మీ ఫోన్ ట్యాపింగ్ అవుతోంది..’అని మెసేజ్ రావడాన్ని బట్టి పిటిషనర్ హరీశ్ రావు తన ఫోన్‌ను ట్యాపింగ్ చేయించి ఉంటారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆధారాలు లేకపోయినా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తప్పు పట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ గత ఏడాది నవంబర్ 22న హైకోర్టులో పిటిషన్‌ను  చక్రధర్ గౌడ్ ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు.

ఆ తర్వాత రోజునే,  డీజీపీకి గౌడ్ ఫిర్యాదు చేశారన్నారు. తిరిగి  హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే దానిని కమిషనర్ పంజాగుట్ట పోలీసులకు ఫార్వడ్ చేశారన్నారు. రాజకీయ కుట్రతో చేసిన ఫిర్యాదును పోలీసులు ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే ఎఫ్‌ఐ ఆర్ నమోదు చేశారన్నారు. ఇది రాజకీయ కుట్రతో వేసిన కేసు అని, దీన్ని కొట్టేయాలని కోరారు.

చక్రధర్ గౌడ్ 2008 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, ఆయనపై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. అత్యాచారం వంటి కేసు కూడా అందులో ఉందన్నారు. తొలుత బీజేపీలో చేరి సిద్దిపేట అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో బీఎస్పీలో చేరి పోటీచేసి పిటిషనర్ చేతిలో ఓటమి చెందాన్నరు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అధికార పార్టీలో చేరాక పిటిషనర్‌పై ఫిర్యాదు చేసి ప్రజల్లో పాపులర్ అవ్వాలనే తలంపులో చక్రధర్ గౌడ్ ఉన్నారన్నారు. ఆధారాలు లేకుండా ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం నేర విశ్వాస ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. 

నాకూ మెసేజ్‌లు వచ్చాయి: న్యాయమూర్తి

ఆత్మహత్యలకు పాల్పడిన వంద మంది రైతుల కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున పరిహారం చెల్లించినట్లు చెప్పుకునే చక్రధర్‌గౌడ్ వాటికి సంబంధించిన ఆదాయ పన్ను వివరాలు నివేదించలేదని శేషాద్రి నాయు డు తప్పుపట్టారు. తొలుత బీజేపీ, ఆ తర్వాత బీఎస్పీలో చేరారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పంచన చేరిన విషయాన్ని అఫిడవిట్లో పేర్కొనలేదన్నారు.

ప్రభుత్వ ఆస్తుల దుర్వినియో గం, బెదిరించడం మొదలైన ఆరోపణలకు ఆధారాలు లేవన్నారు. యాపిల్ ఫోన్లో ట్యాపింగ్ అంశంపై మెసేజ్ వచ్చిందన్న కారణంగా ఫిర్యాదు నమో దు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, తాను కూడా యాపిల్ ఫోన్ వాడుతున్నానని, తనకు అదే తరహా ట్యాపింగ్ వ్యవహారాలపై మెసేజ్‌లు వచ్చాయని, వాటిని పట్టించుకోలేదని చెప్పారు.

రొటీన్‌గా వచ్చే మెసేజ్ కాబట్టి పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు పిటిషన్‌తో పాటు మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కలిపి 19న విచారిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. అప్పటివరకు హరీశ్‌రావును అరెస్టు చేయడంగానీ, కఠిన చర్యలు తీసుకోవడంగానీ చేయరాదన్న గత ఉత్తర్వుల ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.