06-03-2025 12:20:42 AM
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): గత పదేళ్ల పాలనలో కృష్ణా, గోదావరి జలాల విషయంలో బీఆర్‌ఎస్ చేసిన పొరపాటు వల్లే రైతులు ఇబ్బందికి గురవుతు న్నారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని ఉత్తమ్ హితవు పలికారు.
బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రబీసాగు, ఏపీ, తెలంగాణ జల వివాదాలు, బీఆర్‌ఎస్‌పై కీలక వ్యా ఖ్యలు చేశారు. నాటి బీఆర్‌ఎస్ సర్కారు ఏపీకి ధారాదత్తంగా నీటిని వదిలిపెట్టిందని విమర్శించారు. కృష్ణా నదీ జలాల్లో 512 టీఏంసీలు ఏపీకి ఇవ్వాలని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా రాసి చ్చిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూల్స్ మార్చాలని ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడించారు. గోదావరి జలాల్లో పాపం అంతా బీఆర్‌ఎస్‌దేనని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టకపోవడమే అత్యంత నష్టదాయకమని తెలిపారు. బీఆర్‌ఎస్ వల్లే గోదావరి బేసిన్‌లో నీటి ఎద్దడి వచ్చినట్లు వివరించారు.
మేడిగడ్డ దగ్గర రక్షణ చర్యలు చేప ట్టకపోతే ఊళ్లు కొట్టుకుపోతాయని ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశా రు. రబీలో 56 లక్షల ఎకరాల పైగానే సాగు జరుగుతుందన్నారు. రబీ యాక్షన్ ప్లాన్‌ను ముందే ప్రకటించామని, అనుకున్న విధంగానే నీళ్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు.