calender_icon.png 10 January, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్‌ను కస్టడీలో విచారించాలి

10-01-2025 01:24:27 AM

  1. పలుకుబడితో సాక్షులను బెదిరించగలరు
  2. హైకోర్టుకు నివేదించిన పంజాగుట్ట పోలీసులు

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి అందిన ఫిర్యాదులో మాజీ మంత్రి హరీశ్‌రావును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని పంజాగుట్ట పోలీసులు గురువా రం హైకోర్టుకు నివేదించారు. సొంత ప్రయోజనాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

కొంతమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని యంత్రాం గాన్ని వినియోగించుకున్నట్టు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని తెలి పారు. ఫిర్యాదులోని ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని, లోతైన విచారణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. హరీశ్‌రావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి జీ చక్రధర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన పోలీసు కేసును కొట్టివేయాలని హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్‌లో ఏసీపీ కౌంటరు దాఖలు చేశారు. ఫిర్యాదులో తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని చెప్పారు. సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రిగ్రా సాక్షులను బెదిరించగలరని, పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా నిరోధించగలరని, సాక్ష్యాలను తారుమారు చేయగలరని పేర్కొ న్నారు.

డిసెంబరు 1న కేసు నమోదు చేయ గా మూడు రోజులు కూడా కాకుండానే 4న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. కేసును దర్యాప్తు చేసే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పారు. ఆరోపణలను పరిశీలిస్తే సొంత ప్రయోజనాలకు, ఎంపిక చేసుకున్న వ్యక్తుల లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు.

హరీశ్‌రావు చర్యలు రాజ్యాంగ హక్కులను హరించడమేగాకుండా వ్యక్తిగత స్వేచ్ఛను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని తెలిపారు. మంత్రిగా హోదాను దుర్వినియోగం చేశారని, ఐపీసీ, ఐటీ చట్టాల కింద నేరాలకు పాల్పడ్డారని వెల్లడించారు.

చక్రధర్‌గౌడ్ వాంగ్మూలం నమోదు చేశాం

దర్యాప్తులో భాగంగా ఫిర్యాదుదారు చక్రధర్‌గౌడ్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన ట్టు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. దీని ప్రకారం సిద్దిపేట నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నందున ప్రజాదరణ పొందుతుండటంతో పిటిషనర్ కక్ష పెం చుకుని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని పలు కేసులు పెట్టించి వేధించారని తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ చేయించి కార్యకలాపాలను తెలుసుకుంటూ వచ్చారని చెప్పారు. రెండో నిందితుడైన రాధాకిషన్‌రావు ద్వారా ఫిర్యాదుదారుడిని నిర్బంధించి బెదిరించినట్టు వివరించారు. 2023 ఏప్రిల్ 28న పంజాగుట్ట ఆఫీసులో ఉండగా 50 నుంచి -60 మంది టాస్క్‌ఫోర్స్ పోలీసులు వచ్చి ఆఫీసును ధ్వంసం చేసి కొట్టడంతో పాటు సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాల యానికి తీసుకెళ్లి భౌతికదాడికి పాల్పడ్డారని చెప్పారు.

ఇతర సాక్షులైన సీహెచ్ గణేశ్, పీ శ్రావణ్, ఎం సాయి, జీ చంద్రశేఖర్‌గౌడ్, వీరబాబు వాంగ్మూ లాలను నమోదు చేసి వాస్తవాలతో పోల్చి చూశామన్నారు. హరీశ్ రావుకు వ్యతిరేకంగా వెళ్లరాదంటూ పిలిచి బెదిరించినట్టు గణేశ్  తెలిపారని చెప్పారు.

చక్రధర్‌గౌడ్ శామీర్ పేట పోలీసులు నమోదు చేసిన కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉండగా సిద్దిపేట ఏసీపీ పిలిచి ఆయన తరఫు న ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరిం చారని సాయి తెలిపారని పేర్కొ న్నారు. ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు న్నందున దర్యాప్తు జరగాల్సి ఉందని, అందువల్ల హరీశ్‌రావు పిటిషన్‌ను కొట్టివే యాలని కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది.